
కర్పూరం కేవలం దేవుడికి హారతి ఇవ్వడానికే కాదు.. అనేక అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు. కర్పూరంతో ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని కూడా దూరం చేసుకోవచ్చు. ఈ విషయం పక్కన పెడితే.. చాలా మంది ప్రస్తుతం జుట్టుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అందులోనూ జుట్టు ఎక్కువగా రాలిపోతుందని అనుకుంటూ ఉంటారు. కానీ కర్పూరంతో జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. కర్పూరంలో పోషకాలు, పలు రకాల ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. జుట్టుకు కర్పూరం రాయడం వల్ల బలహీనంగా ఉన్న జుట్టు.. బలంగా, దృఢంగా మారుతుంది. అంతే కాకుండా జుట్టు ఎదుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. అయితే కర్పూరాన్ని జుట్టుకు ఏ విధంగా రాయాలి? ఎలా అప్లై చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు ఎక్కువగా రాలిపోయి.. పల్చగా తయారైతే.. కొబ్బరి నూనెలో కర్పూరాన్ని కలిపి హెయిర్‌కు అప్లై చేయవచ్చు. ఇది వెంట్రుకలు రాలడాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అంతే కాకుండా తల కూడా చల్లబడుతుంది. కర్పూరాన్ని.. కొబ్బరి నూనెలో బాగా మిక్స్ చేసి.. స్కాల్ఫ్‌కు సున్నితంగా తలకు మసాజ్ చేసి.. ఓ 20 నిమిషాల పాటు అలానే వదిలేయండి. ఆ తర్వాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తల స్నానం చేస్తే.. మంచి బెనిఫిట్స్ ఉంటాయి.
ఆలీవ్ ఆయిల్‌లో కూడా కర్పూరం కలిపి తలకు పట్టించవచ్చు. ఇలా చేయడం వల్ల తలలో ఉండే చికాకు, దురద, ఇన్ ఫెక్షన్, చుండ్రు వంటి వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. చాలా మంది చలి కాలంలో చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు దీన్ని అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆలీవ్ ఆయిల్‌లో కర్పూరాన్ని బాగా మిక్స్ చేసి.. ఓ అరగంట తర్వాత లేదా నెక్ట్స్ డే అయినా హెడ్ బాత్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
వేపలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెండుగా ఉంటాయి. వేప ఆకులతో ఎన్నో అనారోగ్య సమస్యలను, చర్మ, జుట్టు సమస్యలను నయం చేసుకోవచ్చు. జుట్టు బలంగా ఉండి, చుండ్రు సమస్య తగ్గాలంటే.. వేప ఆకుల పేస్ట్‌లో కర్పూరం కలిపి హెయిర్ మాస్క్‌లా అప్లై చేసుకోవాలి. ఈ పేస్ట్ బాగా ఆరాక.. గోరు వెచ్చటి నీటితో తల స్నానం చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.