Health Tips: వీటిని వండుకుని తింటున్నారా? అయితే, ఈ విషయాలను గమనించాల్సిందే..!

|

Dec 02, 2021 | 5:42 AM

Health Tips: సాధారణంగా ప్రతి ఒక్కరు కూరగాయాలను వండుకునే తింటారు. ఏ కూరగాయలు అయినా.. ఉడకబెట్టి, మంచిగా కర్రీ చేసుకుని తింటారు. అయితే, కొన్ని కూరగాయలను మాత్రం వండకుండా..

Health Tips: వీటిని వండుకుని తింటున్నారా? అయితే, ఈ విషయాలను గమనించాల్సిందే..!
Vigetables
Follow us on

Health Tips: సాధారణంగా ప్రతి ఒక్కరు కూరగాయాలను వండుకునే తింటారు. ఏ కూరగాయలు అయినా.. ఉడకబెట్టి, మంచిగా కర్రీ చేసుకుని తింటారు. అయితే, కొన్ని కూరగాయలను మాత్రం వండకుండా.. పచ్చిగా తినడం వలనే మంచి జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అనారోగ్య సమస్యలు తగ్గడమే కాకుండా.. శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయట. అయితే వేటిని వండకుండా తినాటి.. ఒక వేళ వాటిని వండుకుని తింటే ఏమవుతుంది.. అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. డ్రైఫ్రూట్స్‌ని అలాగే తినడం లేదా.. రాత్రంతా నానబెట్టి ఉదయం తీసుకోవడం ఉత్తమం. కానీ వీటిని ఉడికించి తింటే మాత్రం చాలా ప్రమాదం. డ్రైఫ్రూట్స్‌ను ఉడకబెట్టడం వలన పోషక విలువలు తగ్గిపోవడమే కాకుండా, కేలరీలు, కొవ్వు పరిమాణం పెరుగుతుంది. కాబట్టి.. డ్రైఫూట్స్ విషయంలో ఎప్పుడూ అలా చేయకండి.

ఇక కొబ్బరి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని పొడిగా ఉన్నప్పుడు.. లేదా పచ్చిగా ఉన్నప్పుడు తీసుకోవచ్చు. కానీ ఉడికించి తీసుకోవడం వలన ఆరోగ్యానికి హానికరంగా మారుతుందట. ఈ కొబ్బరిని ఉడికించడం వలన అందులో ఉండే మెగ్నీషియం, సోడియం, పోటాషియం వంటి అనేక ఇతర పోషకాలు నశించిపోతాయి. ఇది ఆరోగ్యానికి మంచిదికాదు. ఇంకా.. బ్రకోలీ కూడా ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనాలు అందిస్తుంది. ఇది రోగ నిరోదక శక్తిని పెంచడమే కాకుండా.. అనేక పోషకాలను అందిస్తుంది. అయితే ఈ బ్రకోలీని ఉడికించి తీసుకోవడం వలన పోషకాలు తగ్గిపోతాయట. అప్పుడు అది తిన్నా ఉపయోగం ఉండదట. మరో వెజిటబుల్‌ క్యాప్సికమ్. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో దిట్ట. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు, చక్కెర, పీచు, ఐరన్, ప్రోటీన్, విటమిన్ సి, వంటి ఇతర అనేక పోషకాలున్నాయి. అయితే దీనిని పచ్చిగా తీసుకుంటేనే మంచిదంటున్నారు ఆహార నిపుణులు.

Also read:

Omicron Spread: వేగంగా వ్యాపిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్..మరో రెండు దేశాల్లో కలకలం..ఒమిక్రాన్ లేటెస్ట్‌ అప్‌డేట్స్

Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్ ఆకలితో పాకిస్తాన్ వ్యాపారం.. భారత్ చేస్తున్న సహాయాన్ని తనదిగా చెప్పుకునే ప్రయాస!

Social Media: సోషల్ మీడియాలో మీ ఎకౌంట్ తీసేయాలని అనుకుంటున్నారా? ఇలా చేయండి..