Health News: ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు.. మీ శరీరంలో ఈసంకేతాలు గుండెపోటుకు దారితీయొచ్చు..

|

Aug 24, 2022 | 8:48 PM

మన లైఫ్ స్టైల్ రోజురోజుకు మారిపోతుంది. గతంలో పెద్దవయసు వారికి వచ్చే గుండె సంబంధిత వ్యాధులు ప్రస్తుతం చిన్న వయస్సు వారిని కబలిస్తున్నాయి. ఎంతో మంది ప్రముఖులు చిన్న వయస్సులోనే గుండెపోటుతో ఈలోకం విడిచి..

Health News: ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు.. మీ శరీరంలో ఈసంకేతాలు గుండెపోటుకు దారితీయొచ్చు..
Heart Attack
Follow us on

Health News: మన లైఫ్ స్టైల్ రోజురోజుకు మారిపోతుంది. గతంలో పెద్దవయసు వారికి వచ్చే గుండె సంబంధిత వ్యాధులు ప్రస్తుతం చిన్న వయస్సు వారిని కబలిస్తున్నాయి. ఎంతో మంది ప్రముఖులు చిన్న వయస్సులోనే గుండెపోటుతో ఈలోకం విడిచి వెళ్లిపోయారు. సిదార్థ్ శుక్లా, పునీత్ రాజ్ కుమార్, సింగర్ కెకె, బ్రహ్మ స్వరూప్ మిశ్రా, తాజాగా సోనాలి ఫోగట్ ఇలా చాలా మంది ఇటీవల కాలంలో గుండె పోటుతో మరణించారు. శరీరంపై ఒత్తిడి పెరగడం వల్ల గుండెపోటుల బారిన పడుతున్నారని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అలాగే గుండె కండరాలు దెబ్బతిన్నప్పుడు, గుండె సామర్థ్యం తగ్గిపోయినప్పుడు గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయంటున్నారు వైద్య,ఆరోగ్య నిపుణులు. గుండెపోటు రావడానికి ముందు కొన్ని సంకేతాలు బాడీలో కనిపిస్తాయని.. వాటిని లైట్ తీసుకుంటే ప్రాణానికే ముప్పు అంటున్నారు.

సాధారణంగా గుండెపోటు వస్తే తక్షణమే స్పందించి సరైన చికిత్స అందిస్తే మనిషి ప్రాణం పోకుండా కాపాడుకునే అవకాశాలు ఉన్నాయి. కాని గుండెపోటు ఆకస్మాతుగా వచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలు లేకుండానే గుండెపోటు రావచ్చే. ఇలా వచ్చేవాటిని కార్డియాక్ అరెస్ట్ అని కూడా అంటారు. ఇది వస్తే ఒక్కసారిగా గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. ఎటువంటి చికిత్స అందించినా గుండె స్పందించదు. మరికొందరికి ఎటువంటి లక్షణాలు కనపడవు, అందుకే సీరియస్ గా తీసుకోరు. ఫ్లూ లేదా ఛాతీలో కండరాల నొప్పి అనిపించినా, దవడ నొప్పి, అలసట, అజీర్తి, ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, చలిలో చెమటలు, తేలికపాటి తలనొప్పి, వికారం వాంతులు, గుండెల్లో మంట.. ఇవ్వన్నీ గుండెపోటు లక్షణాలే అంటున్నారు వైద్య నిపుణులు. బాడీలో ఇటువంటి లక్షణాలు కనిపించినా వెంటనే అప్రమత్తమై వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

మన శరీరంలోని శక్తి మన అవసరాలను తీర్చడానికి గుండె ఆక్సిజన్ తో కూడిన రక్తాన్ని పంప్ చేయలేనప్పుడు.. అలసిపోయినట్లు లేదా అలసటగా అనిపించవచ్చు. దీనివల్ల రోజువారీ పనులను సులభంగా చేసుకోలేదు.

ఇవి కూడా చదవండి

గుండె పోటు రావడానికి ముందు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. రోజూవారీ పనులను సులభంగా చేసుకోలేదు. ఎక్కువుగా అలసిపోతారు. ఏ పనిపైనా దృష్టి పెట్టలేదు.

ఊపిరితిత్తులలో ద్రవం పేరుకుపోవడం వలన దగ్గు, గురక, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో బాధపడతారు.

చీలమండ వాపు, దిగువ అంత్య భాగాల నుంచి ఉపయోగించిన రక్తాన్ని తిరిగి పైకి పంపం చేయడానికి గుండెకు అవసరమైన శక్తి లేనప్పుడు.. చీలమండలు, కాళ్లు, తొడలు, పొత్తికడుపులో ఉన్న ద్రవాన్ని సేకరిస్తాయి. దీనివల్ల చాలామంది బరువు పెరుగుతారు.

కొందరు జ్ఞాపకశక్తి కోల్పోవడం జరుగుతుంది. ఏమి చేయాలి అనేదానిపై స్పషత లేకపోవడంతో ఆలోచనలు ఎక్కువ అవుతాయి.

ఆకలి లేకపోవడం, వికారం లాంటివి కూడా గుండె పోటు రావడానికి లక్షణాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండెలో సమస్య కారణంగా జీర్ణవ్యవస్థ తక్కువ రక్తాన్ని పొందుతుంది. ఇది జీర్ణక్రియలో సమస్యలకు దారితీస్తుంది. దీంతో పేలవమైన ఆకలి, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..