Garlic Health Benefits: వెల్లుల్లిని ఆయుర్వేదంలో ఔషధంగా పరిగణిస్తారు. విటమిన్లు B1, B6, C తో పాటు మాంగనీస్, కాల్షియం, కాపర్, సెలీనియం వంటి పోషకాలు ఇందులో ఉంటాయి. అదనంగా వెల్లుల్లిలో అలిసిన్ అనే ఓ ప్రత్యేక ఔషధ మూలకముంటుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక ప్రతిరోజూ ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలుతీసుకుంటే మరిన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా పలు అనారోగ్య సమస్యలు, వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని సూచిస్తున్నారు.
ఉదర సమస్యలు దూరం
ఉదయం పూట ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకుంటే జీర్ణప్రక్రియ రేటు మెరుగుపడుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం తదితర సమస్యలు దూరమవుతాయి.
ఇమ్యూనిటీ పెరుగుతుంది
వెల్లుల్లి శరీరాన్ని డిటాక్సిఫై చేయడానికి సహకరిస్తుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. తద్వారా రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఫలితంగా అన్ని వ్యాధులతో పోరాడే శక్తిని పొందుతారు. ఇక శరీరాన్ని నిర్విషీకరణ చేయడం వల్ల చర్మం, జుట్టు సమస్యలు కూడా దూరమవుతాయి.
బరువు తగ్గేందుకు
బరువు తగ్గడానికి వెల్లుల్లి కూడా ఎంతో ప్రయోజనకరం. కొవ్వును కరిగించే లక్షణాలు వెల్లుల్లిలో చాలానే ఉంటాయి. పైగా ఇవి జీవక్రియ రేటును మెరుగుపరుస్తాయి. శరీరంలోని కొవ్వును వేగంగా కరిగిస్తాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా మంచి ఆహారం.
షుగర్ లెవెల్స్
డయాబెటిక్ పేషెంట్లకు వెల్లుల్లి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతారు. ఇందులో ఉండే అల్లిసిన్ అనే మూలకం రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. మధుమేహం లేని వారు కూడా రోజూ ఉదయాన్నే వెల్లుల్లిని తీసుకుంటే డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ
క్రమం తప్పకుండా రెండు వెల్లుల్లి రెబ్బలను నీటితో తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. జలుబు, జలుబు, దగ్గు వంటి సమస్యలు దరిచేరవు. అలాగే TB, ఆస్తమా తదితర రోగులకు ఇది ఎంతో మంచిది.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీబయాటిక్ అలాగే యాంటీ కార్సినోజెనిక్ గుణాలు వెల్లుల్లిలో పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే, అధిక బీపీ సమస్యలు ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి