Digestive Relief Tips: ఉబ్బరం, అసిడిటీతో ఇబ్బంది పడుతున్నారా? వీటితో ఈజీగా ఉపశమనం పొందండి..

ప్రస్తుత కాలంలో చాలా మంది సరికానీ జీవనశైలి కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అజీర్తి, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు చాలా ఇబ్బందిగా, అసౌకర్యంగా ఉంటాయి. కొందరిలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. దాంతో ఆస్పత్రి బాట పట్టాల్సి వస్తుంది. అయితే,,

Digestive Relief Tips: ఉబ్బరం, అసిడిటీతో ఇబ్బంది పడుతున్నారా? వీటితో ఈజీగా ఉపశమనం పొందండి..
Pudina

Updated on: Jul 28, 2023 | 10:52 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది సరికానీ జీవనశైలి కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అజీర్తి, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు చాలా ఇబ్బందిగా, అసౌకర్యంగా ఉంటాయి. కొందరిలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. దాంతో ఆస్పత్రి బాట పట్టాల్సి వస్తుంది. అయితే, అసిడిటీ, అజీర్తి, కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడే వారు వంటింట్లో అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలతోనే రిలాక్స్ అవ్వొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవి మంచి ఆరోగ్యాన్ని, జీర్ణ వ్యవస్థ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనాన్ని కల్పిస్తాయి. మరి ఆ పదార్థాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అల్లం: ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, జింగిబిన్ అనే డైజెస్టివ్ ఎంజైమ్‌ కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. దీనిని వంటల్లో గానీ, అల్లం టీ రూపంలో గానీ తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.

సోంపు గింజలు: సోంపు గింజలు కూడా జీర్ణ వ్యవస్థను కాపాడుతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. భోజనం తర్వాత ఒక టీస్పూన్ సోంపు గింజలను తినడం వల్ల కడుపు ఉబ్బరం నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా అధిక నూనె వినియోగించి ఆహారాలను తిన్నప్పుడు వీటిని తినడం వలన ప్రయోజనం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

పెరుగు: ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉన్న పెరుగు హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడం ద్వారా పేగుల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అందుకే ఆహారంలో పెరుగును క్రమం తప్పకుండా చేర్చుకోవాలి. తద్వారా కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య తగ్గుతుంది.

పూదీన: ఇది కూడా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది. కడుపు ఉబ్బరం, నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశనమ కల్పిస్తుంది. అంతేకాదు. పూదీనా ఆయిల్‌ను ఉదరంపై అప్లై చేయడం వలన సమస్య తగ్గుతుంది. పూదీనా టీ తాగడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది.

బొప్పాయి: బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది సులభంగా జీర్ణం కావడానికి ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. ఇది శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తుంది.

మీరు తినే ఆహారంలో ఈ సూపర్‌ఫుడ్‌లను చేర్చడం ద్వారా కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించవచ్చు. మరింత సౌకర్యవంతమైన, ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు కారణమవుతుంది.

ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..