Skin Care: మీరు చేసే పొరపాట్ల వలన స్కిన్ డ్యామేజ్ అవుతుందన్న విషయం మీకు తెలుసా?

| Edited By: Ravi Kiran

Oct 04, 2023 | 5:00 PM

చర్మాన్ని రక్షించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూంటాం. ప్రస్తుతం ఇప్పుడున్న కాలుష్యం, తినే ఆహారాలు, వ్యాయామం చేయకపోవడం వల్ల చర్మం దెబ్బ తింటుంది. ముడతలు పడి పోవడం, గీతలు రావడం, వృద్ధ్యాప్య ఛాయలు వంటికి కనిపిస్తున్నాయి. వీటి వల్ల చిన్న వయసులోనే వయసున్న వ్యక్తున్నా కనిపిస్తున్నారు. దీంతో పలు రకాల క్రీములు, లోషన్లు వాడాల్సి వస్తుంది. వీటిల్లో రసాయనాలు కలవడం క్యాన్సర్లు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అంతే కాకుండా మనం..

Skin Care: మీరు చేసే పొరపాట్ల వలన స్కిన్ డ్యామేజ్ అవుతుందన్న విషయం మీకు తెలుసా?
Skin Crae
Follow us on

చర్మాన్ని రక్షించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూంటాం. ప్రస్తుతం ఇప్పుడున్న కాలుష్యం, తినే ఆహారాలు, వ్యాయామం చేయకపోవడం వల్ల చర్మం దెబ్బ తింటుంది. ముడతలు పడి పోవడం, గీతలు రావడం, వృద్ధ్యాప్య ఛాయలు వంటికి కనిపిస్తున్నాయి. వీటి వల్ల చిన్న వయసులోనే వయసున్న వ్యక్తున్నా కనిపిస్తున్నారు. దీంతో పలు రకాల క్రీములు, లోషన్లు వాడాల్సి వస్తుంది. వీటిల్లో రసాయనాలు కలవడం క్యాన్సర్లు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అంతే కాకుండా మనం రోజూ చేసే కొన్ని రకాల చర్యల వల్ల కూడా చర్మం దెబ్బ తింటుంది. వాటిని కంట్రోల్ చేసుకోవడమే కాకుండా, ఆహార విషయంలో కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకంటో చర్మం ఫ్రెష్ గా, యంగ్ గా ఉంటుంది.

వేడి నీటితో స్నానం:

వాతావరణం కూల్ గా ఉన్నప్పుడు చాలా మంది వేడి వేడి నీటితో స్నానం చేస్తూంటారు. శరీర ఉష్ణోగ్రతకు మించి మరీ వేడి నీటిని ఉపయోగిస్తారు. ఇలా వేడి నీటితో స్నానం చేయడం వల్ల స్కీన్ పై మంట రావడమే కాకుండా.. తేమని కోల్పోతుంది. వేడి వేడి నీటితో బాత్ చేయడం వల్ల దద్దుర్లు కూడా రావచ్చు.

ఇవి కూడా చదవండి

తువాలుతో రఫ్ గా తుడవకూడదు:

చాలా మంది స్నానం చేశాక తువాలుతో తుడుచుకుంటారు. చాలా మంది ఈ తువాలును రఫ్ గా హ్యాండిల్ చేస్తారు. గట్టిగా కండువాతో తుడస్తారు. ఇలా చేయడం వల్ల స్కిన్ పాడవుతుంది. కాబట్టి టవల్ తో సున్నితంగా తుడుచుకోవాలి.

కళ్లు బాగా రుద్దుకోవడం:

కొంత మంది పదే పదే కళ్లు రుద్దుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల చర్మంపై ముడతలు వస్తాయన్న విషయం చాలా కొద్ది మందికి తెలుస్తుంది. అంతే కాకుండా కళ్లపై ఒత్తిడి పెరిగి, తేమ కోల్పోతాయి కళ్లు.

ఒక వైపు పడుకోవడం:

చాలా మంది ఒక వైపు పడుకుంటారు. ఇలా పడుకోవడం వల్ల ఫేస్ అనేది దిండుకు అదుముకుని ఉంటుంది. దీంతో చర్మంపై ఒత్తిడి పెరిగి ముడతలు ఏర్పడతాయి.

ఫోన్ చూడటం:

ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా ఫోనే కనిపిస్తుంది. ఫోన్ చూడకుండా పొద్దు కూడా గడవదు కొంత మంది. అయితే ఇలా తరచూ ఫోన్ చూస్తూ ఉండటం వల్ల ముడతలు వస్తాయన్న విషయం తెలీదు. అధికంగా మెడ వంగడం వల్ల అక్కడ చర్మం ముడుచుకుపోతుంది. గర్భాశయ వెన్నుముక కండరాలు, కణజాల నిర్మాణాల మీద కూడా ప్రెజర్ పెరుగుతుంది.

క్లెన్సింగ్:

చాలా మంది స్కిన్ పై అతిగా క్లెన్సింగ్ చేస్తూంటారు. క్లెన్సింగ్ చేయడం మంచిదే. దీని వల్ల ముఖంపై ఉండే దుమ్ము, ధూళి తొలగి పోతుంది. కానీ రోజుకు రెండు సార్లకు మించి క్లెన్సింగ్ చేయడం వల్ల చర్మంపై ముడతలు రావడమే కాకుండా స్కిన్ పొడిబారుపోతుంది. ఈ కారణంగా చర్మం వృద్ధ్యాప్యానికి దారి తీసే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ముఖం క్లీన్ చేసే ముందు గోరు వెచ్చని నీటిని ఉపయోగించమని చర్మ నిపుణులు సలహా ఇస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.