రాత్రి వేళ శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో.. ఆ రోగానికి చేరువలో ఉన్నట్లే..

మధుమేహానికి ముందు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.. అవి డయాబెటిస్ సంకేతాలేనని, నిర్లక్ష్యం చేయవద్దని వైద్య నిపుణులు చెబున్నారు. వీటిని ముందే గుర్తించి చికిత్స పొందడం మంచిదని సూచిస్తున్నారు. మధుమేహం లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకోండి..

రాత్రి వేళ శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో.. ఆ రోగానికి చేరువలో ఉన్నట్లే..
Diabetes Symptoms
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 06, 2024 | 7:14 PM

ప్రపంచవ్యాప్తంగా మధుమేహం (డయాబెటిస్) కేసులు భారీగా పెరుగుతున్నాయి.. అత్యధిక సంఖ్యలో మధుమేహం ఉన్న రోగులు భారత్‌లోనే ఎక్కువగా ఉన్నారు.. అయితే.. మధుమేహం లేదా డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి.. ఇది సరిగ్గా నిర్వహించలేకపోతే ప్రాణాంతకం కావొచ్చంటున్నారు వైద్య నిపుణులు. డయాబెటిస్ లక్షణాలు మీ రక్తంలో చక్కెర ఎంత ఎక్కువగా ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది. కొంతమందికి, ప్రత్యేకించి ప్రీడయాబెటిస్ సంకేతాలు కూడా కనిపిస్తాయి.. శరీరం ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయని లేదా సరిగ్గా ఉపయోగించని పరిస్థితిని డయాబెటిస్ అంటారు. రక్తంలో చక్కెర పెరగడం వల్ల డయాబెటిస్ లక్షణాలు కనిపిస్తాయి. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ గా దీనిని వర్గీకరించి చికిత్సను అందిస్తారు.

మధుమేహం లక్షణాలివే..

తరచూ మూత్ర విసర్జన: మూత్ర విసర్జన కోసం రాత్రిపూట తరచుగా మేల్కొనడం మధుమేహం సాధారణ లక్షణం.. అయినప్పటికీ, శరీరం మధుమేహంతో బాధపడుతున్నారని హెచ్చరించే ఇతర సంకేతాలు ఉన్నాయి. అలాంటి లక్షణాలు ఏమిటో తెలుసుకోండి..

అధిక దాహం అనుభూతి: అధిక దాహం లేదా పాలీడిప్సియా ( 6 లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ నీరు తాగడం) కూడా శరీరంలో అదనపు చక్కెరను సూచిస్తుంది.

తీవ్రమైన అలసట: మీరు రాత్రిపూట విపరీతంగా అలసిపోయినట్లు అనిపిస్తే, శరీరం గ్లూకోజ్‌ని సరిగ్గా ఉపయోగించుకోదని అర్థం.. ఇది చక్కెర హెచ్చుతగ్గులకు లోనవుతుందనడానికి సంకేతం.

అస్పష్టమైన కంటి చూపు: శరీరంలో షుగర్ ఎక్కువగా ఉంటే కళ్లలోని లెన్స్‌లు తరచుగా వాచిపోతాయి. కొన్నిసార్లు చూపు కూడా అస్పష్టంగా మారవచ్చు.

అనుకోకుండా బరువు తగ్గడం: అనుకోకుండా అధిక బరువు తగ్గడం మధుమేహాన్ని సూచిస్తుంది.

గాయాలు మానకపోవడం: అధిక షుగర్ సమస్య ప్రధాన లక్షణాలలో ఒకటి.. శరీరంలో ఏర్పడిన చిన్న గాయం కూడా త్వరగా మానదు.

ఇంకా ఆకలి పెరగడం, తరచుగా ఇన్ఫెక్షన్లు, శరీరంలో జలదరింపు లేదా తిమ్మిరి, చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడటం కూడా డయాబెటిస్ లక్షణాలేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..