భారతదేశాన్ని డెంగ్యూ (Dengue) పట్టి పీడిస్తోంది. వర్షాకాలం ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. విపరీతమైన జ్వరం, తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, వాంతులు, లక్షణాలతో ఆస్పత్రులకు చేరుతున్న వారి సంఖ్య అధికమవుతోంది. ఆగస్టు 13 వరకు దేశ రాజధాని ఢిల్లీలో 178 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. మే 31, 2022 వరకు దేశంలో 10,172 కేసులు వెలుగుచూశాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) నివేదిక ప్రకారం నగరంలో జనవరిలో 23, ఫిబ్రవరిలో 16, మార్చిలో 22, ఏప్రిల్‌లో 20, మేలో 30, జూన్‌లో 32 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ ప్రకారం.. మే 31, 2022 వరకు దేశంలో 10,172 కేసులు వచ్చాయి. వ్యాధి కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. డెంగ్యూ జ్వరాన్ని వైద్య పరిభాషలో బోన్ ఫీవర్ అని పిలుస్తారు. ఇది దోమల వల్ల కలిగే వైరల్ వ్యాధి. డెంగ్యూ వ్యాప్తి చెందడానికి ఇది సరైన సమయం కాబట్టి ప్రజలు ముఖ్యంగా పిల్లల విషయంలో జాగ్రత్తగ ఉండాలని సీనియర్ డాక్టర్ అంకిత్ ప్రసాద్ సూచించారు. “పిల్లలు ఇప్పటికీ అనేక వ్యాధులకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతూనే ఉన్నందున వారు నిరంతరం వ్యాధుల బారిన పడతుంటారు. వారిలో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి కొద్ది నెలలు జాగ్రత్తగా ఉండాలి. అధిక జ్వరం, తలనొప్పి, అవయవాలపై దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, వాంతులు, కడుపు నొప్పి, వంటి వైద్యులను సంప్రదించాలి” అని చెప్పారు.
అధిక జ్వరంతో పాటు శ్లేష్మ రక్తస్రావం, బద్ధకం, విశ్రాంతి లేకపోవడం, కాలేయం పెరగడం వంటి లక్షణాలు ఉంటాయి. పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపించకపోయినా డెంగ్యూ ఉండవచ్చు. కాబట్టి వారికి రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా జ్వరం వస్తే వెంటనే వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి. వారి విషయంలో నిర్లక్ష్యానికి అవకాశం ఇవ్వకూడదు. ఇది దీర్ఘకాలంలో పెను సమస్యలకు దారి తీస్తుంది. డెంగ్యూకు గురైన పిల్లలు డీ హైడ్రేషన్ కు గురవుతారు. కాబట్టి వారికి నీటిని అందుబాటులో ఉంచాలి. అంతే కాకుండా ద్రవ పదార్థాలను తాగించాలి. పండ్ల రసాలు ఇవ్వాలి. నొప్పి నివారణ చర్యలు చేపట్టాలి. ఇలా చేయడం వల్ల వారిలో డెంగ్యూ లక్షణాలు త్వరగా తగ్గిపోయే అవకాశం ఉంది.
డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా పరిసర ప్రాంతాలను బ్లీచింగ్ చేయాలి. ఇంటి చుట్టుపక్కల నీరు నిలవకుండా చూసుకోవాలి. పార్కులు ప్లే గ్రౌండ్‌లకు వెళ్లేటప్పుడు, పడుకునేటప్పుడు దోమతెరలు వాడాలి. ఈ చర్యలు పాటించడం ద్వారా డెంగ్యూ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం