Boost Child Health: మీ పిల్లలు వీక్ గా ఉన్నారా.. అయితే ఒక్కసారి ఖర్జూరం మిల్క్ ఇచ్చి చూడండి!

| Edited By: Ram Naramaneni

Sep 30, 2023 | 6:42 PM

చాలా మంది పిల్లలు నీరసంగా, బలహీనంగా కనిపిస్తూ ఉంటారు. దానికి ముఖ్య కారణం. వారు సరైన ఆహారం తీసుకోక పోవడం. వాళ్లకు ఎన్ని రకాలుగా ఆహారాలు చేసి పెట్టినా తినరు. అలాంటి వారికి డేట్స్ మిల్క్ బాగా హెల్ప్ అవుతుంది. మీ పిల్లలు పాలు తాగుతూ ఉంటే కనుక వాటిలో ఖర్జూరం కలిపి ఇవ్వండి. దీంతో వారు స్ట్రాంగ్ గానే కాకుండా ఆరోగ్యంగా కూడా తయారవుతారు. ఉదయం, రాత్రి రెండు పూటలా వారికి ఖర్జూరం కలిపిన పాలు ఇవ్వడం వల్ల యాక్టీవ్ గా కూడా ఉంటారు. అంతే కాకుండా ఖర్జూరం పాలలో అనేక పోషకాలు ఉంటాయి. ఖర్జూరాన్ని నానబెట్టి పాలలో మిక్సీ చేసి..

Boost Child Health: మీ పిల్లలు వీక్ గా ఉన్నారా.. అయితే ఒక్కసారి ఖర్జూరం మిల్క్ ఇచ్చి చూడండి!
Dates Milk
Follow us on

చాలా మంది పిల్లలు నీరసంగా, బలహీనంగా కనిపిస్తూ ఉంటారు. దానికి ముఖ్య కారణం. వారు సరైన ఆహారం తీసుకోక పోవడం. వాళ్లకు ఎన్ని రకాలుగా ఆహారాలు చేసి పెట్టినా తినరు. అలాంటి వారికి డేట్స్ మిల్క్ బాగా హెల్ప్ అవుతుంది. మీ పిల్లలు పాలు తాగుతూ ఉంటే కనుక వాటిలో ఖర్జూరం కలిపి ఇవ్వండి. దీంతో వారు స్ట్రాంగ్ గానే కాకుండా ఆరోగ్యంగా కూడా తయారవుతారు. ఉదయం, రాత్రి రెండు పూటలా వారికి ఖర్జూరం కలిపిన పాలు ఇవ్వడం వల్ల యాక్టీవ్ గా కూడా ఉంటారు. అంతే కాకుండా ఖర్జూరం పాలలో అనేక పోషకాలు ఉంటాయి. ఖర్జూరాన్ని నానబెట్టి పాలలో మిక్సీ చేసి అయినా ఇవ్వొచ్చు. లేదా పాలలో ఖర్జూరాన్ని ఉడికించి అయినా పిల్లలకు ఇవ్వవచ్చు. ఖర్జూరం కలిపిన పాలను వారు ఇష్టపడక పోతే.. బనానా వేసి మిల్క్ షేక్ చేయ వచ్చు ఇలా చేయడం వల్ల వాళ్ల మంచి విటమిన్స్, మినరల్స్ అన్నీ వెళ్తాయి.ఇంకా ఖర్జూరం మిల్క్ తో చాలా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం.

పిల్లు దృఢంగా ఉంటారు:

ఖర్జూరం కలిపిన పాలు తాగడం వల్ల పిల్లలు బలంగా, దృఢంగా, ఆరోగ్యంగా తయారవుతారు. ఖర్జూరంలో ఐరన్, పాలలో కాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల పిల్లలు హెల్దీగా ఉంటారు

ఇవి కూడా చదవండి

రక్త హీనత ఉండదు:

ఖర్జూరం, పాలు కలిపి తీసుకోవడం వల్ల రక్త హీనత సమస్య దరి చేరదు. చాలా మంది పిల్లలు రక్త హీనతతో బాధ పడుతూంటారు. ఒకవేళ రక్త హీనత సమస్యతో ఇబ్బంది పడుతున్న పిల్లలకు.. ఖర్జూరం మిల్క్ ఇస్తే ఆ సమస్య త్వరగా తగ్గుతుంది.

నెలసరి సమయంలో ఉపశనం:

ఇప్పుడు ఆడ పిల్లలకు చిన్న వయసులోనే పీరియడ్స్ వచ్చేస్తున్నాయి. నెలసరి సమయంలో వారికి కూడా రక్త స్రావం అధికంగా అవుతుంది. దీంతో బలహీనంగా, నీరసంగా ఉంటారు. కొంత మందికి వెన్ను నొప్పి, నడుము నొప్పి కూడా వస్తుంది. ఇలాంటి ఆడ పిల్లలకు ఖర్జూరం, పాలు కలిపి తీసుకోవడం వల్ల పై సమస్యలన్నింటి నుంచి బయట పడొచ్చు.

యాక్టీవ్ గా ఉంటారు:

ఉదయాన్నే ఖర్జూరం కలిపిన పాలు ఇవ్వడం వల్ల పిల్లలు యాక్టీవ్ గా ఉంటారు. నీరసం, అలసట దరిచేరవు.

ఇమ్యూనిటీ పెంచుతుంది:

డేట్స్ మిల్క్ లో రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని పిల్లలకు ఇస్తే వారిలో ఇమ్యూనిటీ లెవల్స్ అనేవి పెరుగుతాయి. దీంతో అనారోగ్య సమస్యలతో పోరాడే శక్తి వారికి లభిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.