AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది గుండెకే కాదు.. కిడ్నీలకు మంచిదట..! కిడ్నీలు మంచిగుండాలంటే ఇవి తినాల్సిందే

శరీరంలో అంతర్గత అవయవాలు స్థిరంగా పనిచేయాలి అంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాల్సిందే. అవి రోజూ శరీరంలోని మలినాలను ఫిల్టర్ చేసి బయటకు పంపుతాయి. ఈ ప్రక్రియ సజావుగా సాగాలంటే కొన్ని శాకాహార పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవడం అవసరం. కిడ్నీ ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉండే కొన్ని పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది గుండెకే కాదు.. కిడ్నీలకు మంచిదట..! కిడ్నీలు మంచిగుండాలంటే ఇవి తినాల్సిందే
Healthy Kidneys
Prashanthi V
|

Updated on: May 07, 2025 | 12:50 PM

Share

ఉల్లిపాయల్లో ఫైబర్, ప్రోబయోటిక్స్, మాంగనీస్ వంటి పోషకాల సమృద్ధి ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మన్నించి శరీరంలోని మలినాల తొలగింపునకు తోడ్పడతాయి. దాంతో కిడ్నీల పనితీరు మెరుగవుతుంది. రోజూ వంటల్లో ఉల్లిపాయలు వాడటం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

ఆలివ్ ఆయిల్‌ లో పొటాషియం తక్కువగా ఉంటుంది. ఇది యాంటీ ఇంఫ్లమేటరీ లక్షణాలతో కూడి ఉండటంతో శరీరంలోని వాపును తగ్గించడంలో సహకరిస్తుంది. కిడ్నీల పనితీరుపై బరువు పడకుండా ఆరోగ్యంగా పనిచేసేలా చేయడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

క్యాబేజీలో ఉండే ఫైటో కెమికల్స్, విటమిన్ కె, విటమిన్ సి వంటి పోషకాలు శరీరంలోని అనవసర పదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి. ఇవి కిడ్నీల శుభ్రతను మెరుగుపరచడంలో సహకరించడమే కాకుండా శక్తివంతంగా ఉండేలా చేస్తాయి.

యాపిల్‌ పండ్లలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను కాపాడడంలో తోడ్పడతాయి. శరీరాన్ని శుద్ధి చేసి కిడ్నీల పనితీరును ప్రభావితం చేసే హానికర మూలకాలను అడ్డుకుంటాయి.

వెల్లుల్లిలో యాంటీ ఇంఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. కిడ్నీలకు ఒత్తిడి లేకుండా హెల్తీగా ఉండేలా చేస్తుంది. రోజూ వేడి భోజనాల్లో తక్కువ మోతాదులో వెల్లుల్లిని వాడటం మంచిది.

కాలీఫ్లవర్.. ఈ కూరగాయలో విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయే మలిన పదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి. దాంతో కిడ్నీలపై బరువు పడకుండా శుభ్రంగా పనిచేసే అవకాశం కలుగుతుంది.

రెడ్ క్యాప్సికమ్.. ఈ కూరగాయలో విటమిన్ సి, బి6, విటమిన్ ఎ ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. రోజూ వంటల్లో చిటికెడు రెడ్ క్యాప్సికమ్‌ వాడటం మంచిది.

బ్లూబెర్రీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో ఇవి శరీరానికి డిటాక్స్ లాగా పని చేస్తాయి. ఇవి వాపును తగ్గించడంతో పాటు, కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహకరిస్తాయి. ఇవి తినడం వల్ల మూత్రపిండాలు హెల్తీగా పనిచేస్తాయి.

పైవన్నీ కూడా కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. ఇవి శరీరాన్ని శుభ్రంగా ఉంచి వ్యర్థ పదార్థాల తొలగింపును వేగవంతం చేస్తాయి. రోజు తినే ఆహారంలో ఇవి భాగం అయితే కిడ్నీల పనితీరు నిలకడగా ఉంటుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
పరస్పర అంగీకార విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
పరస్పర అంగీకార విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
ఉత్కంఠగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్.. టైటిల్ విన్నర్ ఫిక్స్!
ఉత్కంఠగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్.. టైటిల్ విన్నర్ ఫిక్స్!
రూ.6 లక్షల జీతంతో.. RBIలో ఉద్యోగాలు! రాత పరీక్ష లేకుండానే ఎంపిక
రూ.6 లక్షల జీతంతో.. RBIలో ఉద్యోగాలు! రాత పరీక్ష లేకుండానే ఎంపిక
రూ.40 లక్షలు దోచుకున్నాక మళ్ళీ అదే బెదిరింపు.. కట్ చేస్తే..
రూ.40 లక్షలు దోచుకున్నాక మళ్ళీ అదే బెదిరింపు.. కట్ చేస్తే..
ఏంటీ.. ధురంధర్ సినిమా డైరెక్టర్ భార్య తెలుగులో హీరోయినా.. ?
ఏంటీ.. ధురంధర్ సినిమా డైరెక్టర్ భార్య తెలుగులో హీరోయినా.. ?
సూర్యవంశీది ఆరంభం మాత్రమే.. అంతకుమించిన విధ్వంసం ఈ బుడ్డోళ్లు
సూర్యవంశీది ఆరంభం మాత్రమే.. అంతకుమించిన విధ్వంసం ఈ బుడ్డోళ్లు