AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవి తింటే జబ్బులన్నీ మాయం అవుతాయి.. ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిందే

మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలలో విటమిన్-డి ఒకటి. ఇది ఎముకలు, దేహ బలానికి చాలా అవసరం. విటమిన్-డి తక్కువగా ఉన్నప్పుడు శరీరం బలహీనంగా మారుతుంది. అలసట, కండరాల నొప్పులు వంటి సమస్యలు కనిపించవచ్చు. అయితే కొన్ని ఆహారాలను నిత్యం తీసుకుంటే ఈ లోపం దరిచేరదు.

ఇవి తింటే జబ్బులన్నీ మాయం అవుతాయి.. ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిందే
Vitamin D
Follow us
Prashanthi V

|

Updated on: May 07, 2025 | 12:48 PM

పాలు తాగడం శరీరానికి మేలు చేసే అలవాటు. ఇందులో విటమిన్-డి తో పాటు ప్రోటీన్లు, కాల్షియం ఉంటాయి. ఇవి ఎముకలకు బలాన్ని ఇస్తాయి. నిత్యం పాలను తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. నారింజలో సహజంగా విటమిన్ డి ఉండదు. అయితే ప్రస్తుతం మార్కెట్లో లభించే కొన్ని ఫోర్టిఫైడ్ ఆరెంజ్ జ్యూస్‌లు విటమిన్ డి తో ప్రత్యేకంగా తయారవుతుంటాయి. ఇవి తరచుగా తీసుకుంటే శరీరానికి అవసరమైన విటమిన్ డి అందే అవకాశం ఉంటుంది. అలాగే నిత్యం తాజా నారింజ పండును తినడం వల్ల శరీరానికి ఇతర ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. ఇది విటమిన్ డి లోపం రాకుండా సహాయపడుతుంది.

పెరుగు తినటం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో సహజంగా విటమిన్ డి ఉంటుందనడంలో సందేహం లేదు. ఇది జీర్ణక్రియకు బాగా ఉపయోగపడుతుంది. రోజు పెరుగు తీసుకుంటే శక్తి, ఆరోగ్యం నిలబడతాయి.

సాల్మన్, ట్యూనా, మాకేరెల్ వంటి చేపలలో విటమిన్ డి మంచి స్థాయిలో ఉంటుంది. ఇవి ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్, ప్రోటీన్లతో నిండిపోయి శరీరానికి పుష్కలంగా బలం ఇస్తాయి. వారంలో రెండు మూడు సార్లు చేపలు తీసుకోవడం ద్వారా విటమిన్ డి లోపం తగ్గుతుంది.

గుడ్డులోని పచ్చసొనను తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్ డి అందుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో సూర్యరశ్మి తక్కువగా లభించేటప్పుడు పచ్చసొన తినటం చాలా ఉపయోగకరం. ఇది శరీర బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది.

బ్రౌన్ రైస్, గోధుమలు, జొన్నలు వంటి తృణధాన్యాలు శక్తిని ఇచ్చే విధంగా పనిచేస్తాయి. ఇవి విటమిన్ డి కు కూడా సహాయపడతాయి. ఉదయం అల్పాహారంలో వీటిని చేర్చడం వల్ల శక్తి, పోషణ రెండూ అందుతాయి.

పాలతో చేసిన పదార్థాలు కూడా విటమిన్ డి అందించగలవు. జున్ను, చీజ్, స్విస్ చీజ్ వంటివి పాళ్లలో కొద్ది మోతాదులో తీసుకుంటే శరీరానికి ఉపయోగపడతాయి. వీటిలో సహజంగా విటమిన్ డి ఉంటుంది.

పాలు తాగలేని వారికి సోయా, బాదం, ఓట్స్ పాలు ఒక మంచి ప్రత్యామ్నాయంగా ఉంటాయి. ఇవి కూడా విటమిన్ డి తో ఫోర్టిఫైడ్‌గా అందుబాటులో ఉంటాయి. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్ డి అందుతుంది.

ప్రతిరోజూ ఈ పదార్థాలను ఆహారంలో భాగంగా తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా విటమిన్ డి లోపం కూడా తలెత్తదు. అలాగే సూర్యకాంతిని తగినంతగా పొందడం ద్వారా ఈ విటమిన్‌ను సహజంగా పొందవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే సులభమైన అలవాట్లతో శ్రద్ధ తీసుకోవాలి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)