Beauty Tips: కొబ్బరి నూనెలో పంచదార కలిపి ఇలా చేస్తే.. మీ ముఖం తెల్లగా మారుతుంది!

అందంగా కనిపించాలని కోరుకోని వారుండరు. వయసులో ఉన్నవారైనా, వయసు పైబడిన వారైనా అందంగా ఉండాలని అనుకుంటారు. రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తూంటారు. కొంత మంది మార్కెట్లో లభ్యమయ్యే అన్ని రకాల ప్రాడెక్ట్ ని ఉపయోగిస్తూంటా ఉంటారు. ఇంకొంత మంది బ్యూటీ పార్లర్ లకు క్యూ కడుతూ ఉంటారు. అయితే ఇంట్లోనే కొన్ని రకాల టిప్స్ ను పాటించడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇప్పుడు చెప్పబోయే టిప్ ను యూజ్ చేయడం వల్ల ముఖంపై ఉండే..

Beauty Tips: కొబ్బరి నూనెలో పంచదార కలిపి ఇలా చేస్తే.. మీ ముఖం తెల్లగా మారుతుంది!
Beauty Skin

Edited By: Ravi Kiran

Updated on: Oct 05, 2023 | 8:15 PM

అందంగా కనిపించాలని కోరుకోని వారుండరు. వయసులో ఉన్నవారైనా, వయసు పైబడిన వారైనా అందంగా ఉండాలని అనుకుంటారు. రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తూంటారు. కొంత మంది మార్కెట్లో లభ్యమయ్యే అన్ని రకాల ప్రాడెక్ట్ ని ఉపయోగిస్తూంటా ఉంటారు. ఇంకొంత మంది బ్యూటీ పార్లర్ లకు క్యూ కడుతూ ఉంటారు. అయితే ఇంట్లోనే కొన్ని రకాల టిప్స్ ను పాటించడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇప్పుడు చెప్పబోయే టిప్ ను యూజ్ చేయడం వల్ల ముఖంపై ఉండే నలుపు, మృత కణాలు, ట్యాన్ ను ఈజీగా తొలగించుకోవచ్చు. ఇది చేసుకోవడం కూడా చాలా సులభం. ఈ చిట్కా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో.. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు:

ఫేస్ వాష్ క్రీమ్, కొబ్బరి నూనె, పంచదార

ఇవి కూడా చదవండి

ఉపయోగించు విధానం:

కేవలం ఈ మూడు పదార్థాలతోనే మనం ఫేస్ పై డెడ్ స్కిన్ సెల్స్ ను, ట్యాన్ ని ఈజీగా తొలగించుకోవచ్చు. ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకుని అందులోకి కొద్దిగా ఫేస్ వాష్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ కోకోనెట్ ఆయిల్, రెండు స్పూన్ల పంచదార వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్ కి బాగా పట్టించి.. సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. గట్టిగా రబ్ చేస్తే పంచదార వల్ల ముఖంపై దద్దర్లు, గీతలు వస్తాయి. కాబట్టి మెత్తగా మర్దనా చేసుకోవాలి. ఈ ప్యాక్ బాగా ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. ముఖంపై ఉండే మలినాలు, ట్యాన్, డెడ్ స్కిన్ సెల్స్ పోతాయి.

ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు:

ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగించడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఎండ వల్ల చర్మంపై ఉన్న ట్యాన్ కూడా పోతుంది. అయితే వెంటనే రిజల్ట్ కనిపించకపోయినా.. ట్రై చేస్తూ ఉంటే తప్పకుండా ఫలితం ఉంటుంది.

నలుపు పోతుంది:

కొబ్బరి నూనె, పంచదార ఫేస్ ప్యాక్ ముఖానికి స్క్రబర్ లా పని చేస్తుంది. ట్యాన్ ని పోగొడుతుంది. కాబట్టి ముఖంపై ఉండే నలుపు పోయి.. తెల్లగా అవుతుంది. అలాగే కొబ్బరి నూనె వల్ల ఫేస్ కి తేమ అందుతుంది. పొడి బారకుండా కాపాడుతుంది. ఈ ఫేస్ ప్యాక్ వల్ల నలుపు పోయి.. ముఖం మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది. అలాగే అందంగా మారుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.