Cigarette Addiction: సిగరెట్ వ్యసనం, కాబట్టి ఈ ఇంటి నివారణలను ప్రయత్నించండి, వ్యసనం నుండి బయటపడటం సులభం అవుతుంది

Cigarette Addiction: క్యాన్సర్‌కు ప్రధాన కారణాలలో పొగాకు ఒకటి అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. పొగాకు నమలడం, ధూమపానం చేయడం ఆరోగ్యానికి చాలా హానికరం అని వైద్యులు నిత్యం చెబుతూనే ఉంటారు.

Shiva Prajapati

|

Updated on: Feb 06, 2022 | 9:48 PM

Cigarette Addiction: క్యాన్సర్‌కు ప్రధాన కారణాలలో పొగాకు ఒకటి అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. పొగాకు నమలడం, ధూమపానం చేయడం ఆరోగ్యానికి చాలా హానికరం అని వైద్యులు నిత్యం చెబుతూనే ఉంటారు. అయితే, ఒక్కసారి వీటిని తీసుకోవడం మొదలు పెడితే.. ఏ స్థాయిలో బానిస అవుతారో కూడా ఊహించలేం. ధూమపానానికి బానిసలై ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. అందుకే ఇలాంటి దురలవాట్లను మానుకోవాలని సూచిస్తుంటారు. ధుమపానం అలవాటు నుంచి బయటపడేందుకు చాలా సంస్థలు రిహాబిలిటేషన్ సెంటర్లను నిర్వహిస్తున్నాయి. వైద్యపరమైన ట్రీట్‌మెంట్ కూడా ఇస్తుంటారు. అయితే, సిగరెట్ వంటి పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండేందుకు, ఆ అలవాట్లను మానుకునేందుకు వంటింటి చిట్కాలు చాలంటున్నారు నిపుణులు. మరి ఆ వంటింటి చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 6
సిగరేట్‌, బీడీలలో నికోటిన్ అనే పదార్థం ఉంటుంది. దీని ప్రభావం శరీరంపై 40 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ ప్రభావం తగ్గిన వెంటనే.. సిగరెట్, బీడీ మళ్లీ తాగాలనే కోరిక పడుతుంది. అలా ఒక వ్యక్తి ధూమపానానికి బానిసగా మారిపోతాడు.

2 / 6
సీజనల్ ఫ్రూట్స్ తినాలి. ముఖ్యంగా నారింజ, అరటి, జామ, కివి, స్ట్రాబెర్రీ మొదలైన విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తినాలి. ఇవి కూడా సిగరెట్ తాగాలనే కోరికలను తగ్గించడంలో సహాయపడటంతో పాటు.. శరీరాన్ని ఆరోగ్యంగా చేస్తుంది.

3 / 6
గుట్కా, పాన్ తినే అలవాటు ఉన్నవారు సోంఫు తినడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. పొగాకు ఉత్పత్తులు తినాలని అనిపించినప్పుడల్లా ప్రయత్నామ్నాయంగా సోంఫును తినాలని సూచిస్తున్నారు. ఇది మీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా.. పొగాకు వ్యసనం నుంచి బయటపడేస్తుందని చెబుతున్నారు.

4 / 6
మీరు సిగరెట్ లేదా పొగాకు మానేయాలని నిర్ణయించుకున్నట్లయితే.. పాలు తాగడం అలవాటు చేసుకోండి. వింతగా అనిపించినా ఇది వాస్తవం అని నిపుణులు చెబుతున్నారు. ధూమపానం చేయాలనే కోరికను తగ్గించడంలో పాలు అద్భుతంగా సహాయపడుతాయట. సిగరెట్ తాగాలనిపించినప్పుడల్లా ఒక కప్పు పాలు తాగాలి. తద్వారా ఆ వ్యసనం నుంచి క్రమంగా బయటపడొచ్చు.

5 / 6
పచ్చి పనీర్ ఆరోగ్య పరంగా చాలా ప్రయోజనకరమైనది. దీనిని తినడం వల్ల ఆకలి వేయదు. కడుపు నిండుగా ఉండటంతో.. మరొక పదార్థం తినాలనిపించదు. మీకు సిగరెట్ తాగాలనిపించినప్పుడల్లా పచ్చి పనీర్ ముక్కలను తింటే.. క్రమంగా ఆ కోరిక తగ్గిపోతుంది.

6 / 6
Follow us