Cholesterol: ఈ లక్షణాలు మీ శరీరంలో కనిపిస్తున్నాయా? అయితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి..!

|

Jul 02, 2022 | 10:39 PM

Cholesterol: శరీరంలో కొవ్వు (కొలెస్ట్రాల్) ఎక్కువగా ఉంటే ముఖంతో సహా శరీరంలోని వివిధ భాగాలలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

Cholesterol: ఈ లక్షణాలు మీ శరీరంలో కనిపిస్తున్నాయా? అయితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి..!
Health Tips
Follow us on

Cholesterol: శరీరంలో కొవ్వు (కొలెస్ట్రాల్) ఎక్కువగా ఉంటే ముఖంతో సహా శరీరంలోని వివిధ భాగాలలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దు. అధిక కొలెస్ట్రాల్ మరణానికి దారి తీస్తుంది. హార్ట్ స్ట్రోక్ కు కారణం అవుతుంది. కొవ్వు అధికంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. ఒకవేళ కొవ్వు అధికంగా ఉన్న ఆహారాలు తీసుకున్నప్పటికీ.. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి. లేదంటే రక్తంలో కొవ్వు పేరుకుపోతుంది. దీని వల్ల మధుమేహం బారిన పడే ప్రమాదం ఉంది. శరీరంలో కొవ్వు పెరిగితే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. లేదంటే.. రక్త పరీక్ష ద్వారా కూడా తెలుసుకోవచ్చు. కొవ్వు పెరిగితే కనిపించే లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నీలిరంగు ముఖం: చల్లని వాతావరణంలోనూ ముఖం నీలం రంగులోకి మారితే, మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగిందని అర్థం చేసుకోవచ్చు. ఇది క్రమంగా మీ రక్తనాళాల్లో రక్తం సరఫరాను అడ్డుకుంటుంది.

కంటి కింద పచ్చని చారలు(శాంథెలాస్మా): కంటి అడుగు భాగంలో పసుపు, కుంకుమ రంగులో గీతలు కనిపిస్తాయి. చర్మంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు ఇలా జరుగుతుంది.

శాంతోమా: ఇది శాంథెలాస్మా మాదిరిగానే ఉంటుంది. అయితే ఇది కాళ్లు, పాదాలపై కనిపిస్తుంది.

సోరియాసిస్: కొలెస్ట్రాల్, సోరియాసిస్ దగ్గరి సంబంధం ఉంది. దీనిని హైపర్లిపిడెమియా అంటారు. చర్మం రంగు మారడం జరుగుతుంది.

చర్మం పొడిబారడం: చర్మం రంగు మారడం, పొడిబారడం జరుగుతుంది.

కాలు తిమ్మిరి : పాదాలతో పాటు చూపుడు వేలు, మడమ లేదా బొటనవేలులో తిమ్మిరి ఉంటే, అది నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది. రాత్రి నిద్రిస్తున్నప్పుడు కాళ్ళ నొప్పి వస్తుంది.

పాదాల చర్మం రంగు మారడం : శరీరంలోని అధిక కొలెస్ట్రాల్ కారణంగా, పాదాలకు రక్త సరఫరా కూడా సరిగా ఉండదు. ఫలితంగా రక్తం లేకపోవడం వల్ల, రక్తం ద్వారా చేరే ఆక్సీజన్, పోషకాలు అందకపోవడం వల్ల చర్మం, గోళ్ల రంగు మారుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..