Winter Care: చలికాలంలో పిల్లలను ఎలా చూసుకోవాలి? తల్లిదండ్రులు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..!
ఋతువులు మారుతున్నా కొద్ది మనుషుల జీవిన విధానంలోనూ మార్పులు అవసరం. లేదంటే అనారోగ్యం బారిన పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎండాకాలం పోయింది, వానాకాలంలో పోయింది, చలికాలం వచ్చసింది.
ఋతువులు మారుతున్నా కొద్ది మనుషుల జీవిన విధానంలోనూ మార్పులు అవసరం. లేదంటే అనారోగ్యం బారిన పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎండాకాలం పోయింది, వానాకాలంలో పోయింది, చలికాలం వచ్చసింది. అయితే, అన్ని ఋతువుల్లో మాదిరిగానే చలికాలంలో కూడా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. చలికాలం రాగానే అందరికీ జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు వస్తుంటాయి. అదే విధంగా పిల్లలు కూడా తరచుగా జబ్బుల బారిన పడుతుంటారు. అందుకే చలికాలంలో పిల్లలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మరి చలికాలంలో పిల్లలు అనారోగ్యానికి గురికాకుండా ఉండటానికి ఏం చేయాలి? వారికి ఎలాంటి పోషణను అందించాలి? వంటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పిల్లలకు స్వెట్టర్ వంటి దుస్తులు వేయాలి..
ఉదయం, రాత్రి వేళల్లో చలి ఎక్కువగా ఉండడంతో పిల్లలకు శరీరమంతా కప్పి ఉంచే దుస్తులు వేయాలి. కాళ్లకు సాక్స్ వేసి, తలకు మఫ్లర్ వేయడం మంచింది. నవజాత శిశువులు, చిన్న పిల్లలను చల్లని గాలికి బహిర్గతంగా తిప్పకూడదు. తలకు క్యాప్, హ్యాండ్ సాక్స్, కాళ్లకు సాక్స్ పెట్టడం మంచిది. పొడి వాతావరణం ఉన్నట్లయితే ఇంట్లో హ్యూమిడిఫైయర్‌ను ఉపయోగించవచ్చు. లేకపోతే చల్లాగా ఉన్నట్లయితే.. ఇంట్లో హీటర్‌ను ఉపయోగించవచ్చు.
ఆహారం..
పిల్లలకు సమతుల ఆహారం పెట్టాలి. మంచి పోషకాలు గల ఆహారం తినిపించాలి. ఈ సీజన్‌లో లభించే అన్ని రకాల కూరగాయలు, పండ్లను తినిపించాలి. తృణధాన్యాలతో సహా ఇప్పటి వరకు తింటున్న ఆహారాన్ని కూడా తినిపించాలి. చలికాలంలో పొడి గాలి వల్ల శరీరానికి మంచి కొవ్వు పదార్థాలు అవసరం అవుతాయి. చలికాలంలో పిల్లలకు నెయ్యి, వెన్న వంటి ఆహారాన్ని పెట్టవచ్చు. అయితే, అతిగా మాత్రం తినిపించకూడదు.
శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచాలి..
చలికాలంలో శరీరానికి చెమట ఎక్కువగా పట్టదు. నీరు అవసరం ఉండదు కాబట్టి పిల్లలు ఎక్కువసేపు నీళ్లు తాగరు. తల్లిదండ్రులే వీలైనంత వరకు పిల్లలకు తరచుగా నీళ్లు తాగించాలి. వీలైనంత వరకు గోరువెచ్చని నీటిని తాగించాలి. చలికాలంలో చాలా మంది పిల్లలు వివిధ రకాల ఇన్‌ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంది. చల్లని వాతావరణం కావడంతో అనేక వైరస్‌లు విజృంభిస్తాయి. అందుకే పిల్లలు తినే ముందు, అల్పాహారం తీసుకునే ముందుు లేదా, పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తరువాత అల్పాహారం చేసే ముందు చేతులు, కాళ్లు బాగా కడగాలి.
దగ్గుపై అవగాహన కల్పించాలి..
చలికాలంలో పిల్లలకు జలుబు, దగ్గు సమస్య బాగా వస్తుంది. అయితే, దగ్గినప్పుడు పిల్లలు తమ చేతిని అడ్డు పెట్టుకుంటారు. ఇలా చేయడం ద్వారా వైరస్‌లు సులభంగా వ్యాపించే ప్రమాదం ఉంది. అందుకే పిల్లలకు జలుబు చేసినప్పుడు రుమాలు ఇవ్వాలి. దగ్గినప్పుడు రుమాలు రుమాలు అడ్డు పెట్టుకోవాలని సూచించాలి.
ఇన్‌ఫ్లూయేంజా టీకా..
ఇన్‌ఫ్లుయేంజా వ్యాక్సిన్, ఫ్లూ షాట్ పిల్లలకు దగ్గు, జలుబు, జ్వరం రాకుండా ఉంటాయి. వీటిని ఒక సంవత్సరం పిల్లలకు రెండుసార్లు వేస్తారు. 6 నెలల తరువాత ఈ వ్యాక్సిన్‌ను ఒక నెల వ్యవధిలో రెండుసార్లు వేస్తారు. ఆ తరువాత ప్రతి సంవత్సరం తీసుకోవాలి. పిల్లలు ఒక సంవత్సరం కంటే ఎక్కువ వయసు ఉన్నట్లయితే.. ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌లో కొత్త టీకా అందుబాటులోకి ఉంటుంది.
చర్మ సంరక్షణ..
సాధారణంగా చలికాలంలో ముఖం, చేతులు, పాదాలు, మడమలు పగిలిపోవడం వల్ల చర్మం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎగ్జిమా సమస్యలు ఇప్పటికే ఉన్నవారికి ఇది మరింత సాధారణం. ఈ సమస్య పరిష్కారం కోసం అభ్యంజన, ఆయుర్వేదం, మన సంస్కృతిలో మొదటి నుండి ఉన్న నూనె స్నానం పాటించాలి. తలస్నానానికి ముందు నూనె రాసి కాసేపు అలాగే ఉంచాలి. ఇలా రోజూ చేస్తే ఫలితం ఉంటుంది.
స్నానం ఎలా చేయాలి?
ఈ చలికాలంలో చర్మంపై ఆయిల్ కంటెంట్ ఉండటం మంచిది. ఎక్కువ కెమికల్స్ వాడకుండా తలస్నానం చేయవచ్చు. కొంచెం శనగ పిండి లేకపోతే పిల్లల కోసం తయారుచేసిన సబ్బును కూడా వాడవచ్చు. కొందరికి విపరీతమైన చర్మ సమస్యలు, సోరియాసిస్, ఎగ్జిమా వంటివి వస్తుంటాయి. దీనికి మాయిశ్చరైజింగ్, క్రీమ్స్‌తో చెక్ పెట్టొచ్చు. లేదంటే వైద్యులను సంప్రదించడం మంచింది.
ముక్కులోంచి రక్తం కారుతోందా?
పొడి గాలి ముక్కులో తేమను తగ్గిస్తుంది. అది రక్తస్రావానికి దారి తీస్తుంది. ముక్కు ఎండిన తర్వాత రోగనిరోధక శక్తి తగ్గుతుంది. పొడి ముక్కు నుంచి వైరస్‌లు నేరుగా శరీరంలోకి వెళ్తాయి. ఫలితంగా అనేక ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. ఈ ఇన్‌ఫెక్షన్ల కారణంగా పిల్లల ముక్కు నుంచి రక్తం కారుతుంది. అందుకే పిల్లల ముక్కును వీలైనంత తేమగా ఉంచాలి. నాసల్ డ్రాప్స్ అందుబాటులో ఉంచుకోవాలి.
యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడొద్దు..
పిల్లలకు దగ్గు, జలుబు, జ్వరం వచ్చిన ప్రతిసారీ యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఫార్మసీకి వెళ్లి యాంటీబయాటిక్స్ తీసుకురావడం, జలుబుకు, దగ్గుకు స్వంతంగా మెడిసిన్ తీసుకువచ్చి ఇవ్వడం చేస్తుంటారు. ఇలా ప్రతిసారి యాంటీబయాటిక్స్ ఇవ్వడం వలన.. వారిలో నాచురల్ రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అంతేకాదు.. వీటికి అతివినియోగం వల్ల తరువాతి కాలంలో అవి పని చేయకుండా ఉంటాయి.
దగ్గు, జలుబు కోసం ఇంటి చిట్కాలు..
ఒక్కోసారి దగ్గు, జలుబు కోసం డాక్టర్‌ని కలవాల్సిన అవసరం లేదు. 6 ఏళ్లలోపు పిల్లలకు దగ్గు, జలుబు మందులు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ఇంట్లో దొరికే మిరియాలు, తేనె, తేనె, లవంగాలు వాడితే దగ్గు తగ్గుతుంది.
ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..