Health Tips: ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు ‘టమాటా’కు దూరంగా ఉండాలి.. కాదంటే కష్టాలు తప్పవు మరి..

మనం రోజూ తినే కూరగాయల్లో టమాటా కూడా ఒకటి. ఇది మనిషి యవ్వనాన్ని కాపాడుతుంది. ఎందుకంటే టమాటా సరైన జీర్ణక్రియను నిర్వహించడంలో సహాయపడుతుంది.

Health Tips: ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు ‘టమాటా’కు దూరంగా ఉండాలి.. కాదంటే కష్టాలు తప్పవు మరి..
Tomatoes
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 25, 2022 | 6:24 AM

మనం రోజూ తినే కూరగాయల్లో టమాటా కూడా ఒకటి. ఇది మనిషి యవ్వనాన్ని కాపాడుతుంది. ఎందుకంటే టమాటా సరైన జీర్ణక్రియను నిర్వహించడంలో సహాయపడుతుంది. అనేక ఉదర సంబంధిత సమస్యలను నివారిస్తుంది. టమాటాలో విటమిన్ ఎ, సి కంటెంట్ పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ బి, స్టార్చ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దాంతోపాటు.. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, క్రోమియం, కోలిన్, ఫోలేట్, ఐరన్, జింక్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. అందుకే టమాటా తినడం వల్ల రకరకాల పోషకాలను పొందవచ్చు. అయితే, కొంతమంది మాత్రం టమాటాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. ఎందుకో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే..

టమాటాలు ఎవరు తినకూడదు?

కిడ్నీ ఫెయిల్యూర్, డయాలసిస్ రోగులు, కిడ్నీ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న రోగులు టమాటాలు తినకూడదు. టమాటాలు రోజువారీ ఆహారంలో భాగమైనప్పటికీ, కిడ్నీలో రాళ్లను నివారించాలంటే వాటిని తినొద్దు. ఒకవేళ తింటే.. కిడ్నీ సంబంధిత సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.

టమాటాలు ఎవరు తినొచ్చు..

చర్మపు పుండ్లు, తరచుగా చర్మం రంగు మారడం, నిరంతర అల్సర్‌లతో బాధపడేవారు టమాటాలను ఎక్కువగా తీసుకోవచ్చు. విటమిన్ ఎ లోపం, కంటి సమస్యలు ఉన్నవారు టమాటాలను క్రమం తప్పకుండా తినవచ్చు. టమాటా హృద్రోగులకు, బైపాస్ సర్జరీ చేసిన రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. టమాటాలో క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే లక్షణాలు ఉన్నాయి.

టమాటా ప్రయోజనాలు..

టమాటాలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన దంతాలు, చిగుళ్ళు, చర్మంలో సహాయపడుతుంది. టమాటాలోని యాంటీ ఆక్సిడెంట్లు మన శరీర కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. టొమాటో గుండె జబ్బులకు చాలా మంచిది. రక్త నాళాల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది రక్త ప్రసరణను నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఒక వ్యక్తి ఎన్ని టమాటాలు తినవచ్చు?

ఒక వ్యక్తి రోజుకు 300 నుండి 400 గ్రాముల కూరగాయలు తినాలి. టమాటాలను 100 గ్రాముల వరకు తినవచ్చు. ఇది రెండు టమాటాలకు సమానం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..