AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్‌ షాప్‌కి వెళ్తున్నారా.. ఫ్రీగా వచ్చే వీటిని అస్సలు వదలొద్దు.. ప్రయోజనాలు తెలిస్తే..

ఆదివారం వచ్చిందంటే.. ప్రతి ఇక్కరికి గుర్తొచ్చేది చికెన్ లేదా మటన్.. సండెరోజు నాన్ వెజ్ లేనిదే చాలా మంది ముద్ద దిగదూ.. అందుకే ఉదయం లేచిన వెంటనే చికెన్, మటన్ షాప్‌లకు పరిగెడతారు. అయితే ఇక్కడ చాలా మంది చేసే తప్పేంటంటే.. చికెన్ లేదా మటన్ తిసుకునే టప్పుడూ నిర్వాహకులు ఫ్రీగా ఇచ్చే లివర్‌ను కొందరు తీసుకోరు.. కానీ మీరు తీసుకునే చికెన్, మటన్ కంటే ఆ లివర్‌లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని మీకు తెలుసా? అయితే లివర్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పదండి.

చికెన్‌ షాప్‌కి వెళ్తున్నారా.. ఫ్రీగా వచ్చే వీటిని అస్సలు వదలొద్దు.. ప్రయోజనాలు తెలిస్తే..
Chicken Liver Benefits
Anand T
|

Updated on: Nov 16, 2025 | 11:13 AM

Share

ఆదివారం వచ్చిందంటే.. ప్రతి ఇక్కరికి గుర్తొచ్చేది చికెన్ లేదా మటన్.. సండెరోజు నాన్ వెజ్ లేనిదే చాలా మంది ముద్ద దిగదూ.. అయితే వీరిలో చికెన్‌, మటన్‌ లివర్‌ ఫ్యాన్స్ సపరేట్ ఉంటారు. వీరూ చికెన్‌తోనే పూర్తి భోజనాన్ని కానిస్తారు. దాని ప్రత్యేక రుచి కారణంగా, చికెన్, మటన్ లివర్ ప్రజలలో చాలా ప్రసిద్ధి చెందింది. అయితే ఇది ఆరోగ్యకరైనది అయినప్పటికీ.. దీన్ని మోతాదులో తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ లివర్ ఆరోగ్యానికి ఎంతవరకు మంచివి? ఎంత మోతాదులో తీసుకోవాలి? అనే అంశాల్లో నిపుణుల అభిప్రాయం తెలుసుకుందాం

చికెన్ లివర్ ప్రయోజనాలు

చికెన్ లివర్‌లో ఆరోగ్యానికి మేలు కలిగించే అనే పోషకాలకు ఉంటాయి. ఇందులో ప్రోటీన్, ఐరన్, సెలీనియం, విటమిన్ బి12, ఫోలేట్, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటయి. ఇందులో ఉండే విటమిన్ బి12 మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు దోహదపడుతుంది. అలాగే ఇందులోని సెలీనియం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చికెన్ లివర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కాబట్టి డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఇది ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. దీనితో పాటు, ఇందులో లైంగిక ఆరోగ్యానికి దోహదపడే ఫోలేట్ ఉంటుంది. అలాగే ఇది బరువును నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది.

మటన్ లివర్ ప్రయోజనాలు

చికెన్‌తో పాటు మటన్ లివర్ కూడా ఆరోగ్యానికి మేలు కలిగించే పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్లు ఎ, డి, బి12, ఐరన్, జింక్, పొటాషియం, కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరచడంలో సహాయపడుతాయి. దానితో పాటు రక్తహీనతను నివారించడానికి కూడా తోడ్పడుతాయి. అలాగే ఇందులో ఉండే విటమిన్ బి12 రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇందులో ఉండే ఖనిజాలు శరీరంలో ఎంజైమ్ పనితీరును మెరుగుపరుస్తాయి.

చికెన్ లేదా మటన్ లివర్‌ను ఎంత మోతాదులో తీసుకోవాలి

అయితే ఈ చికెన్, మటన్ లివర్ వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికి దానికి మోతాదులో తీసుకోవడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మోతాదు ఎక్కువైతే ఇది హానికరంగా మారవచ్చు. ఆరోగ్య నిపుణుల ప్రకారం వారానికి 50 నుంచి 75 గ్రాముల లోపు లివర్‌ తింటే మంచిది. గర్భిణులు, చిన్నపిల్లలు, విటమిన్‌ సప్లిమెంట్లు తీసుకునేవారు దీన్ని తినే ముందు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలి. మితంగా తీసుకుంటే చికెన్ లేదా మటన్ లివర్‌ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. కానీ మితిమీరితే ప్రమాదం అంటున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us