Chemotherapy: కీమోథెరపీ ట్రీట్‌మెంట్‌ టైంలో ఈ ఆహారాలు తప్పక తీసుకోవాలి.. నిపుణుల సూచనలు ఇవే

|

Feb 15, 2024 | 9:34 PM

గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌ రోగుల సంఖ్య పెరిగిపోతుంది. శరీరంలోని ఏ భాగంలోనైనా క్యాన్సర్ రావచ్చు. శరీరంలో క్యాన్సర్ కణాలు వేగంగా వ్యాపించకుండా ఉండేందుకు కీమోథెరపీ ట్రీట్‌మెంట్‌ ఇస్తారు. కీమోథెరపీ తర్వాత వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. కీమోథెరపీ ట్రీట్‌మెంట్‌ సమయంలో శరీరం బలహీనంగా మారుతుంది. అంతేకాకుండా అనేక దుష్ప్రభావాలు కూడా వెంటాడుతాయి. వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం..

Chemotherapy: కీమోథెరపీ ట్రీట్‌మెంట్‌ టైంలో ఈ ఆహారాలు తప్పక తీసుకోవాలి.. నిపుణుల సూచనలు ఇవే
Cancer Diet
Follow us on

గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌ రోగుల సంఖ్య పెరిగిపోతుంది. శరీరంలోని ఏ భాగంలోనైనా క్యాన్సర్ రావచ్చు. శరీరంలో క్యాన్సర్ కణాలు వేగంగా వ్యాపించకుండా ఉండేందుకు కీమోథెరపీ ట్రీట్‌మెంట్‌ ఇస్తారు. కీమోథెరపీ తర్వాత వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. కీమోథెరపీ ట్రీట్‌మెంట్‌ సమయంలో శరీరం బలహీనంగా మారుతుంది. అంతేకాకుండా అనేక దుష్ప్రభావాలు కూడా వెంటాడుతాయి. వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం, ఆహారం రుచి తెలియకపోవడం, ఆకలి లేకపోవడం, మ్యూకోసైటిస్ సమస్యలు సాధారణంగా కనిపిస్తాయి. ఈ సమయంలో పోషకాహారం తప్పక తీసుకోవాలి. ఎక్కువగా నీళ్లా త్రాగాలి. సాధారణంగా కీమోథెరపీ తర్వాత బాటిల్ వాటర్, ఫ్రూట్ జ్యూస్ ఎక్కువగా తాగాలని వైద్యులు సూచిస్తారు. అలాగే శరీరం చల్లగా ఉండాలంటే వీటిని తప్పక తీసుకోవాలి.

ఇంకా ఏమేమి తినాలి..

కార్బోహైడ్రేట్లు – కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందిస్తాయి. ఈ సమయంలో శరీరంలో శక్తి తగ్గుతుంది. తక్షణ శక్తిని అందించడానికి కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలు తినాలి. తృణధాన్యాలు, పండ్లు తప్పనిసరిగా ఆహారంలో ఉండేలా చేసుకోవాలి. తద్వారా మలబద్ధకం సమస్య రాదు. డయేరియా సమస్యకు దూరంగా ఉంచుతుంది.

ప్రోటీన్ – కీమోథెరపీ తర్వాత దెబ్బతిన్న కణజాలాన్ని సరిచేయడానికి ప్రోటీన్ అవసరం. అందుకే మాంసం, చేపలు, గుడ్లు, సోయామిల్క్, వెజిటబుల్ ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే మంచి కొవ్వు పదార్థాలు తినాలి. నట్స్, అవకాడోస్, రకరకాల నట్స్‌ తప్పనిసరిగా ఆహారంలో తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం సమస్యలను నివారించడానికి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినాలి. కనీసం 38 గ్రాముల డైటరీ ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. వాంతులు, విరేచనాల సమస్య ఉంటే ద్రవపదార్థాలు ఎక్కువగా తినాలి. కొన్ని క్యాన్సర్ చికిత్సలు కాలేయం, ప్రేగులపై అధిక ప్రభావం చూపుతాయి. కాబట్టి మొదటి నుంచి ఎక్కువగా నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. నీళ్లతో పాటు ఉప్పు, పంచదార, పండ్ల రసం, క్యాన్ వాటర్ ఎక్కువగా తాగాలి.

శరీర మరమ్మత్తు కోసం సూక్ష్మపోషకాలు అవసరం. ఇటువంటి పరిస్థితిలో యాంటీఆక్సిడెంట్ విటమిన్లు, జింక్, సెలీనియం అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తినాలి. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. సెల్ రిపేర్‌లో ఇవి సహాయపడతాయి. అందుకే కీమోథెరపీ తర్వాత జాగ్రత్తగా ఉండాలి. కీమోథెరపీ తర్వాత, శరీరంలో రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. అయితే పచ్చి ఆహారం, సగం ఉడకబెట్టిన గుడ్లు, పచ్చి కూరగాయలు, తాజా పండ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. పండ్లు, కూరగాయలను బాగా కడిగిన తర్వాత మాత్రమే తినాలి. ఆహారాన్ని అధిక ఉష్ణోగ్రతలో ఉడికించాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.