- Telugu News Photo Gallery Avocado Benefits: Avocado Reduces The Risk Of Heart Attack, Know All Benefits
Avocado Benefits: 6 నెలల పాటు ఈ పండు తిన్నారంటే.. వృద్ధులకు కూడా పాదరసం లాంటి జ్ఞాపకశక్తి!
నేటి కాలంలో గుండె జబ్బుల కారణంగా మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. జీవనశైలిలో కొద్దిపాటి మార్పులు, సరైన ఆహారం తీసుకుంటే గుండు జబ్బుల నుంచి తేలికగా బయటపడొచ్చు. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించే ఆహారాల్లో అవకాడో ముందు వరుసలో ఉంటుంది. అవోకాడో పండు శాస్త్రీయ నామం పెర్సియా అమెరికా. ఈ పండును వారానికి రెండు సార్లు తింటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు..
Updated on: Feb 15, 2024 | 9:13 PM

నేటి కాలంలో గుండె జబ్బుల కారణంగా మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. జీవనశైలిలో కొద్దిపాటి మార్పులు, సరైన ఆహారం తీసుకుంటే గుండు జబ్బుల నుంచి తేలికగా బయటపడొచ్చు. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించే ఆహారాల్లో అవకాడో ముందు వరుసలో ఉంటుంది. అవోకాడో పండు శాస్త్రీయ నామం పెర్సియా అమెరికా. ఈ పండును వారానికి రెండు సార్లు తింటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

దీనితో పాటు ఆహారంలో ఫైబర్, మోనోశాచురేటెడ్ కొవ్వులను కూడా చేర్చుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ మన గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో అవకాడో పాత్ర కీలకమైనది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే, దాని వల్ల అనేక సమస్యలు పుట్టుకొస్తాయి.

అయితే మార్కెట్లో అవకాడో ధర అధికంగా ఉంటుంది. దీని అధిక ధర కారణంగా చాలా మంది దీనిని తినేందుకు సాహసించరు. మరైతే ఎలా అనుకుంటున్నారా?అందుకు ఓ పరిష్కారం ఉంది. అవకాడో కొని తినలేకపోతే.. దానికి బదులుగా రోజువారీ ఆహారంలో అరటిపండ్లు, బాదం, చియా గింజలు, వేరుశెనగలు తిన్నా సరిపోతుంది.

Avocado

ఇందులో కొవ్వులో కరిగే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి బూస్టర్‌గా పనిచేస్తుంది. అవోకాడోలో 20 ముఖ్యమైన విటమిన్లతోపాటు మినరల్స్, వివిధ పోషకాలు ఉంటాయి. అవకాడోలో విటమిన్-ఇతో పాటు లుటిన్, కెరోటిన్, జియాక్సంతిన్ కూడా పుష్కలంగా ఉంటాయి. అవకాడో పండులో ఫైబర్ ఉంటుంది. ఫలితంగా ఇది జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. ఈ పండు శరీరంలో ఎలాంటి నొప్పులనైనా తగ్గించడంలో సహాయపడుతుంది. ఆరు నెలల పాటు నిరంతరంగా అవకాడో తింటే వృద్ధులు కూడా వారి జ్ఞాపకశక్తిని మెరుగుపరచుకోవచ్చట.




