Cycling: సైక్లింగ్‌తో బెల్లీఫ్యాట్‌కి చెక్.. ఈ వ్యాధులు అస్సలు మీ దరిచేరవు..

| Edited By: Venkata Chari

Jun 03, 2022 | 8:15 AM

ఒక పరిశోధన ప్రకారం.. బరువు తగ్గడానికి, వ్యాయామం ద్వారా వారంలో కనీసం 2 వేల కేలరీలు బర్న్ చేయాలి. స్థిరమైన, సాధారణ సైక్లింగ్ ద్వారా ప్రతి గంటకు 300 కేలరీలు బర్న్ అవుతాయి.

Cycling: సైక్లింగ్‌తో బెల్లీఫ్యాట్‌కి చెక్.. ఈ వ్యాధులు అస్సలు మీ దరిచేరవు..
Weight Loss Tips Hindi
Follow us on

Cycling: ఆధునిక కాలంలో చెడు జీవనశైలి కారణంగా చాలామంది స్థూలకాయానికి
గురవుతున్నారు. పొత్తికడుపు, నడుము చుట్టూ కొవ్వు పెంచుకుంటున్నారు. దీనిని తగ్గించడం చాలా
కష్టమైన పని. కానీ ఒకపని చేస్తే సులువుగా తగ్గించుకోవచ్చు. సైకిల్ తొక్కడం వల్ల మెటబాలిక్ రేట్
పెరిగి, కండరాలకు బలం చేకూరి, శరీరం దృఢంగా తయారవుతుంది. కాబట్టి సైకిల్‌ తొక్కడం
అనేది బరువు, పొట్ట కొవ్వు తగ్గించుకోవడానికి జిమ్‌లో గంటల తరబడి వర్కవుట్ చేయడం
లాంటిది. వెంటనే సైకిల్‌ తొక్కడం ప్రారంభించండి.

ఒక పరిశోధన ప్రకారం.. బరువు తగ్గడానికి, వ్యాయామం ద్వారా వారంలో కనీసం 2 వేల కేలరీలు
బర్న్ చేయాలి. స్థిరమైన, సాధారణ సైక్లింగ్ ద్వారా ప్రతి గంటకు 300 కేలరీలు బర్న్ అవుతాయి.
మీరు ఎక్కువ సైకిల్‌ తొక్కుతుంటే మీరు ఎక్కువ కేలరీలు బర్న్ చేస్తారు. శరీరం నుంచి కొవ్వు
మొత్తం కరిగిపోతుంటుంది. అయితే మీరు సైక్లింగ్‌తో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం
చాలా ముఖ్యం. లేదంటే బలహీనంగా తయారవుతారు.

సరుకులు తెచ్చుకోవాలన్నా, ఆఫీసుకు వెళ్లాలన్నా, స్కూల్‌కి వెళ్లాలన్నా మార్కెట్‌కి వెళ్లాల్సి వస్తే
సైకిల్‌నే వాడండి. కేలరీలను బర్న్ చేయడంలో సహాయం చేయడంతో పాటు, సైక్లింగ్ అనేక తీవ్రమైన
వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. సైకిల్ తొక్కడం ద్వారా గుండె జబ్బులు,
పక్షవాతం, మధుమేహం, డిప్రెషన్ వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. సైక్లింగ్ అనేది అన్ని
వయసుల వారు ఆనందించగల తక్కువ ప్రభావ వ్యాయామం. సైకిల్ తొక్కడం వల్ల డిప్రెషన్, ఒత్తిడి,
ఆందోళన వంటి మానసిక వ్యాధులు తగ్గించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.