Heart Attack: గుండెపోటు వస్తుందనే భయంగా ఉందా? కార్డియోఫోబియా లక్షణాలు, కారణాలు, చికిత్సను తెలుసుకోండి

|

Aug 07, 2022 | 9:58 AM

Cardiophobia: ఫోబియా అనేది ఒక రకమైన మానసిక సమస్య. దీనిలో ఒక వ్యక్తి ఏదో తెలియని లేదా లేనిదాని గురించి భయపడతాడు. మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక దాని గురించి భయపడుతుండటం..

Heart Attack: గుండెపోటు వస్తుందనే భయంగా ఉందా? కార్డియోఫోబియా లక్షణాలు, కారణాలు, చికిత్సను తెలుసుకోండి
Cardiophobia
Follow us on

భయాన్ని ఇంగ్లీష్‌లో ఫోబియా అని అంటారు. ఫోబియా అనేది ఒక రకమైన మానసిక సమస్య. దీనిలో ఒక వ్యక్తి ఏదో తెలియని లేదా లేనిదాని గురించి భయపడతాడు. మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక దాని గురించి భయపడుతుండటం చాలాసార్లు గమనించి ఉంటాం. అది నీటికి సంబంధించిన ఫోబియా అయినా లేదా ఎత్తు నుంచి చూసినప్పుడు జరిగే ఫోబియా అయినా కావచ్చు.. ఇలా అనేక రకాల ఫోబియాలు ఉన్నాయి. కార్డియో అంటే గుండెకు సంబంధించినది. ఫోబియా అంటే భయం అంటే గుండెపోటు వచ్చి చనిపోవడం వంటి గుండె జబ్బులు వస్తాయని భయం. కార్డియోఫోబియా అనేది ఒక రకమైన భయం. దీనిలో ఒక వ్యక్తి గుండెపోటు వచ్చి మరణిస్తాడని భయపడతాడు. దీని కారణంగా ఒక వ్యక్తికి ఛాతీలో కొంచెం నొప్పిగా అనిపించినా.. తనకు గుండెపోటు వస్తుందేమో అనే భయం అతని మనస్సులోకి వస్తుంది. కార్డియోఫోబియా లక్షణాలు, కారణాలు, నివారణలను తెలుసుకుందాం-

కార్డియోఫోబియా లక్షణాలు ఏంటి?

కార్డియోఫోబియా ఉన్నవారిలో ఆందోళన అనేక రకాలుగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది. తల తిరగడం, అధిక రక్తపోటు సమస్యలు, చెమటలు పట్టడం, మూర్ఛపోవడం, వణుకు మొదలైన వాటితో గుండె దడ ఉంటుంది. అన్ని పరీక్షల తర్వాత కూడా మీకు గుండె జబ్బు ఉందని భావిస్తే అది కార్డియోఫోబియా లక్షణం కావచ్చు.

కార్డియోఫోబియా ..

కార్డియోఫోబియా ఉండటానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఇంట్లో ఎవరైనా గుండెపోటు లేదా గుండె జబ్బుతో మరణించినట్లయితే.. అధిక కొలెస్ట్రాల్, BP లేదా శ్వాసకోశ సమస్యలు ఉన్న వ్యక్తులు కూడా ఈ సమస్యను కలిగి ఉంటారు. ఎందుకంటే ఈ వ్యాధులు లేదా పరిస్థితులు రోగిని స్ట్రోక్‌కు గురిచేస్తాయి.

కార్డియోఫోబియాకు చికిత్స ఏంటి?

కార్డియోఫోబియా చికిత్స కోసం సైకాలజిస్టును కలవడం ఉత్తమం. మంచి గుండె ఆరోగ్యాన్ని నిర్ధారించుకోవడానికి.. మీరు సంవత్సరానికి రెండుసార్లు చెక్ చేసుకోవచ్చు. తద్వారా మీరు గుండె జబ్బులకు భయపడరు. దీర్ఘ శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు.. ధ్యానం ఇలాంటివి మీకు సహాయం చేస్తాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం