Brinjal Side Effects: ఈ ఆరోగ్య సమస్యలున్నవారు వంకాయ తింటున్నారా.. ఎంత ప్రమాదకరమో తెలుసా..

రక్తహీనత ఉన్నవారు ఈ కూరగాయను తినకూడదని సూచించారు. కడుపులో రాళ్ల సమస్య ఉన్న రోగులు కూడా వంకాయను తినకూడదని సూచిస్తున్నారు. ఈ రోజు వంకాయ తినడం వలన కలిగే సమస్యల గురించి తెలుసుకుందాం..

Brinjal Side Effects: ఈ ఆరోగ్య సమస్యలున్నవారు వంకాయ తింటున్నారా.. ఎంత ప్రమాదకరమో తెలుసా..
Brinjal Side Effects

Updated on: Oct 13, 2022 | 10:32 AM

ఏడాది పొడవునా దొరికే కూరగాయ వంకాయ. హిందూ మత శ్రాద్ధ కర్మలందు వంకాయని ఉపయోగించరు. కనుక ఈ వంకాయ మనదేశానికి ఇతర దేశాల నుంచి వచ్చినదిగా భావిస్తున్నారు. అయితే వంకాయతో రకరకాల ఆహారపదార్ధాలను తయారు చేస్తారు. ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. అయితే కొందరిలో కొన్ని సందర్భాల్లో వంకాయ తినడం ప్రమాదకారి కూడా. ముఖ్యంగా అలర్జీలతో బాధపడే వారు వంకాయ తినకండి. అలెర్జీ మరింత తీవ్రమవుతుంది. డిప్రెషన్ కు మందులు వాడుతుంటే వంకాయ తినకూడదు. కంటికి సంబంధించిన ఇబ్బందులున్నా వంకాయను తినకూడదని సలహా ఇస్తారు. పైల్స్ రోగులు వంకాయ తినకూడదు. ఇది హెమోరాయిడ్స్‌కు కారణమవుతుంది. రక్తహీనత ఉన్నవారు ఈ కూరగాయను తినకూడదని సూచించారు. కడుపులో రాళ్ల సమస్య ఉన్న రోగులు కూడా వంకాయను తినకూడదని సూచిస్తున్నారు. ఈ రోజు వంకాయ తినడం వలన కలిగే సమస్యల గురించి తెలుసుకుందాం..

ఎలాంటి సమస్యలు తలెత్తుతాయంటే?

జ్వరం వచ్చినప్పుడు వంకాయ తినకూడదు. ఇది శరీరంలో వేడిని పెంచుతుంది. అతిగా తీసుకోవడం వల్ల కడుపులో చికాకు కలుగుతుంది. ఇది జీర్ణ రసాల మొత్తాన్ని పెంచుతుంది. గుండెల్లో మంటకు కారణమవుతుంది. వంకాయలో మూత్రపిండాలకు హాని కలిగించే ఆక్సలేట్‌లు ఉంటాయి. తక్కువ రక్తపోటు ఉన్నవారు వంకాయ తినకూడదు. ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. గర్భిణీ స్త్రీలు వంకాయను తినకూడదు. గర్భధారణ సమయంలో తీసుకుంటే  పెరుగుతున్న పిండానికి హాని కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

అప్రమత్తంగా ఉండండి:

కళ్ల మంటలు.. పైత్యం వంటి రోగాలు ఉంటే వంకాయ తినకూడదు. ఇది కంటి రుగ్మతను ప్రేరేపించి మీ సమస్యను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. ఎవరైనా పైల్స్ వ్యాధితో బాధపడుతుంటే వంకాయ తినడం మానేయాలి. శరీరంలో రక్తం లోపిస్తే వంకాయ తినకూడదు. రక్తహీనతతో బాధపడుతున్న వారు వంకాయను తినడం వలన ఆ సమస్య మరింత పెరుగుతుంది. అందువల్ల వంకాయ తింటే ఏమైనా అనారోగ్య సమస్యలు అనిపిస్తే ముందుగా వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే ప్రతి కూరగాయ ప్రయోజనాలతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఈ విషయంలో జాగ్రత్త అవసరం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ( ఇందులోని అంశాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. పాటించే ముందు ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)