Breastfeeding Tips: పిల్లలకు పాలిచ్చే తల్లులూ..ఈ చిట్కాలతో మధుమేహాన్ని కంట్రోల్ చేయొచ్చు..

పిల్లలకు తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవి. అయితే మధుమేహంతో బాధపడే మహిళలు.. తమ పిల్లలకు పాలివ్వడానికి ఇబ్బంది పడుతుంటారు. పాలివ్వడం వలన వ్యాధి తీవ్రత పెరగడం, లేదా పిల్లలకు ఈ బ్లడ్ షుగర్ వస్తుందనే భయంతో పాలివ్వడానికి జంకుతుంటారు.

Breastfeeding Tips: పిల్లలకు పాలిచ్చే తల్లులూ..ఈ చిట్కాలతో మధుమేహాన్ని కంట్రోల్ చేయొచ్చు..
Breastfeeding
Follow us
Amarnadh Daneti

|

Updated on: Aug 12, 2022 | 11:01 AM

Breastfeeding Tips: పిల్లలకు తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవి. అయితే మధుమేహంతో బాధపడే మహిళలు.. తమ పిల్లలకు పాలివ్వడానికి ఇబ్బంది పడుతుంటారు. పాలివ్వడం వలన వ్యాధి తీవ్రత పెరగడం, లేదా పిల్లలకు ఈ బ్లడ్ షుగర్ వస్తుందనే భయంతో పాలివ్వడానికి జంకుతుంటారు. కాని వైద్యుల సలహాలు, సూచనలతో పాటు.. ఈ చిట్కాలు పాటిస్తే పిల్లలకూ పాలిస్తూ బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మధుమేహన్ని కంట్రోల్ చేయడానికి తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్ తీసుకునే విషయంలో వైద్యుల సలహా పాటించండి.. మీలో ఉన్న బ్లడ్ షుగర్ స్థాయి ఆధారంగా టిఫిన్ పాలు ఇవ్వడానికి ముందు తీసుకోవాలా, తరువాత తీసుకోవాలో డాక్టర్లు సూచిస్తారు.

మధుమేహంతో బాధపడే తల్లులకు వారి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు అవసరం, తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన సమయం ఉండదు.. దీంతో షుగర్ ఉన్న తల్లులు తగిన మోతాదులో నీరు తాగాలి. సమయానికి ఆహారం తీసుకోవాలి. ప్రశాంతంగా ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా నిద్రపోవాలి. డయాబెటిస్ బారిన పడిన తల్లులు పిల్లలకు పాలిచ్చేందుకు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. దీంతో వారిలో ఉన్న అపోహలను తొలగించుకోవడానికి సరైన కౌన్సిలింగ్ పొందాల్సి ఉంటుంది. పిల్లలకు పాలిచ్చే సరైన విధానాలను తెలుసుకోవాలి. బ్లడ్ షుగర్ స్థాయి ఆధారంగా ఇన్సులిన్ ను ఏమోతాదులో తీసుకోవాలి, ఎటువంటి భోజనం తీసుకోవాలి, ఎలాంటి పదార్థాలు తినకూడదనే దానిపై తగు జాగ్రత్తలు పాటించాలి. పిల్లలకు పాలిచ్చే తల్లులు తప్పనిసరిగా పోషక ఆహారాన్ని తినాలి.

మధుమేహం ఉన్న చాలా మంది మహిళలకు పాలిచ్చిన తర్వాత బ్లడ్ షుగర్ లెవల్స్ పడిపోవచ్చు. ఆ సమయంలో కొంత మొత్తంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లతో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఒక్కసారిగా షుగర్ లెవల్స్ పడిపోతే పిల్లలకు పాలివ్వడానికి ముందు అవసరమైతే చిరు తిళ్లు తినడం మంచిది. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా బ్యాగ్ లో తినడానికి చిరు తిండ్లు ఏవైనా తీసుకెళ్లాలి. పాలిచ్చిన తర్వాత కొంతమంది తల్లులకు దాహంగా అనిపించవచ్చు. ఈసమయంలో అవసరమైన మోతాదులో నీరు తాగడం మంచిది. శిశువు నిద్రపోయిన ప్రతి సమయంలో తల్లి కూడా పడుకోవడానికి ప్రయత్నించాలి. తద్వారా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం లేకుండా చూసుకోవచ్చు. మధుమేహం ఉన్న తల్లులు పాలిచ్చేటప్పుడు కేవలం ఒక రొమ్ము నుండే కాకుండా రెండింటి నుంచి పాలివ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. తద్వారా పుండ్లు పడకుండా చూసుకోవచ్చు. ఎక్కువుగా పుండ్లు వస్తే వైద్యులను సంప్రదించాలి. తల్లి ఎల్లప్పుడూ సంతోషంగా రిలాక్స్ గా ఒత్తిడి లేకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. ఇలా చేస్తే తప్పకుండా పాలిచ్చే తల్లులూ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి