AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Damage: ఆల్కహాల్ మాత్రమే కాదు, ఈ ఆహారాలు కూడా కిడ్నీని దెబ్బతీస్తాయి.. జాగ్రత్త..!

సరైన సమయంలో సరైన చికిత్స అందకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ కూడా వస్తుంది. దీని కోసం, మూత్రపిండాల వైఫల్యం ప్రారంభ లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం.

Kidney Damage: ఆల్కహాల్ మాత్రమే కాదు, ఈ ఆహారాలు కూడా కిడ్నీని దెబ్బతీస్తాయి.. జాగ్రత్త..!
Kidneys
Jyothi Gadda
|

Updated on: Jan 20, 2023 | 6:00 PM

Share

మానవశరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. ఈ మూత్రపిండాలు రక్తం నుంచి వ్యర్థాలను, అదనపు నీటిని బయటకు పంపడంలో కీలకపాత్ర పోషిస్తాయి. సోడియం, పొటాషియం, కాల్షియం వంటి రసాయనాల సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడతాయి. అందుకే కిడ్నీలను మానవ శరీరానికి సంబంధించిన యోధులు అంటారు. కానీ, మారిన జీవనశైలి, చెడు ఆహారం కారణంగా కిడ్నీలు త్వరగా దెబ్బతింటున్నాయి. కేవలం ఆల్కహాల్ తీసుకోవడం వల్లనే కిడ్నీలు దెబ్బతింటాయని అందరూ నమ్ముతున్నారు. అయితే ఆల్కహాల్ మాత్రమే కాదు, మనం రోజూ తినే కొన్ని ఆహార పదార్థాలు కూడా కిడ్నీలను దెబ్బతీస్తాయి. కిడ్నీ ఇన్ఫెక్షన్, కిడ్నీ స్టోన్, కిడ్నీ క్యాన్సర్ వంటి అనేక ఆరోగ్య సమస్యలు చెడు ఆహారం వల్ల వస్తాయి. సరైన సమయంలో సరైన చికిత్స అందకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ కూడా వస్తుంది. దీని కోసం, మూత్రపిండాల వైఫల్యం ప్రారంభ లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. మరీ ముఖ్యంగా కిడ్నీకి హాని కలిగించే ఆహారాలకు దూరంగా ఉండటం కూడా చాలా ముఖ్యం.

కిడ్నీ దెబ్బతినే ఆహారాలు: * ఆల్కహాల్: ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారిలో కిడ్నీ ఫెయిల్యూర్ ఎక్కువగా ఉంటుంది . ఆల్కహాల్ మీ మూత్రపిండాలపై చెడు ప్రభావాన్ని చూపడమే కాకుండా, మీ మిగిలిన అవయవాలకు కూడా హానికలిగిస్తుంది.

* పాల ఉత్పత్తులు: మంచి ఆరోగ్యానికి పాల ఉత్పత్తులు చాలా అవసరం. అయినప్పటికీ, పాల ఉత్పత్తులలో ప్రోటీన్, కాల్షియం చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

ఇవి కూడా చదవండి

* ఉప్పు: ఉప్పు లేని ఆహారం రుచిగా ఉండదు. అయినప్పటికీ, అధిక ఉప్పు తీసుకోవడం రక్తపోటును పెంచడమే కాకుండా, మీ మూత్రపిండాలను కూడా దెబ్బతీస్తుంది.

రెడ్ మీట్: రెడ్ మీట్ ప్రోటీన్‌కు ఉత్తమ మూలం అనడంలో సందేహం లేదు. అయితే దీన్ని అధికంగా తీసుకోవడం మూత్రపిండాల ఆరోగ్యానికి మంచిది కాదు.

* కృత్రిమ స్వీటెనర్: కృత్రిమ స్వీటెనర్లు పిల్లలనే కాకుండా వృద్ధులను కూడా ఆకర్షిస్తాయి. అయితే వీటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి, వీలైనంత వరకు అలాంటి ఆహారాలకు దూరంగా ఉండండి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..