AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women health: ఈ పోషకాల ఉంటే మహిళలకు సమస్యలు దరిచేరవు.. సూపర్ ఎనర్జీ వారి సొంతం!

సమయానుగుణంగా ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు సరిగ్గా అందవు. కానీ, పోషకాలు శక్తినిచ్చే విషయంలో కీలకపాత్ర పోషిస్తాయి. అలాగే మరికొన్ని పోషకాల లోపం దీర్ఘకాలిక వ్యాధులకు కారణం అవుతుంది. ఈ నేపథ్యంలో మహిళలు శక్తి పెంచుకోడానికి ఏ పోషకాలపై దృష్టి పెట్టాలి? ఎలాంటి పౌష్టికాహారం తీసుకుంటే మహిళలకు మేలు జరుగుతుందో? ఓసారి తెలుసుకుందాం.

Women health: ఈ పోషకాల ఉంటే మహిళలకు సమస్యలు దరిచేరవు.. సూపర్ ఎనర్జీ వారి సొంతం!
Nutritious Food For Women Health
Nikhil
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 15, 2023 | 8:00 AM

Share

ప్రపంచంలో ఆడాళ్లు మగవాళ్లు ఎంత సమానమని చెబుతున్నా..స్త్రీల శరీర నిర్మాణం కారణంగా వారు శక్తి విషయంలో కొంచెం వెనకబడి ఉంటారు. అలాగే ఇంట్లోని పనులన్నీ వారే చేయడంలో శక్తిని కోల్పోతారు. అలాగే సమయానుగుణంగా ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు సరిగ్గా అందవు. కానీ, పోషకాలు శక్తినిచ్చే విషయంలో కీలకపాత్ర పోషిస్తాయి. అలాగే మరికొన్ని పోషకాల లోపం దీర్ఘకాలిక వ్యాధులకు కారణం అవుతుంది. ఈ నేపథ్యంలో మహిళలు శక్తి పెంచుకోడానికి ఏ పోషకాలపై దృష్టి పెట్టాలి? ఎలాంటి పౌష్టికాహారం తీసుకుంటే మహిళలకు మేలు జరుగుతుందో? ఓసారి తెలుసుకుందాం.

కాల్షియం

కాల్షియం శరీరంలో ఎముకల సాంద్రతను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది దంతాలు, ఎముకలను దృఢంగా ఉంచుతుంది. ఓ పరిశోధన ప్రకారం, పురుషులతో పోలిస్తే స్త్రీలు బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువడి ఉంది. అందువల్ల మహిళలు వారి రోజూ వారీ ఆహారంలో  కాల్షియం అధికంగా ఉత్పత్తి చేసే ఆహరం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 

మెగ్నీషియం

మెగ్నీషియం సాధారణ కండరాలు, నరాల పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది హార్ట్ బీట్ ను స్థిరంగా ఉంచుతుంది. అలాగే ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను నిర్మించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది సాధారణ రక్తపోటును నిర్వహించడానికి కూడా మేలు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

విటమిన్ ఎ

విటమిన్ ఎ మహిళల ఆరోగ్యాన్ని పెంపొందించడంలో గణనీయమైన పాత్రను కలిగి ఉంటుంది. అలాగే విటమిన్ ఎ కొన్ని రకాల క్యాన్సర్‌లను నిరోధించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపర్చాడానికి కూడా సాయం చేస్తుంది. ఫోలేట్

ఫోలేట్

ఫోలేట్ రక్తహీనతను నివారించడానికి చాలా ముఖ్యమైంది, ఎందుకంటే ఇది శరీరంలో కొత్త రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఫోలేట్ లోపం వల్ల పెద్ద పేగు, మెదడు, గర్భాశయ మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. అలాగే తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. గర్భధారణ సమయంలో ఫోలేట్ చాలా ముఖ్యమైనది.

ఐరన్

ఐరన్ శరీరానికి ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. మెరుగైన అభిజ్ఞా సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే పురుషులతో పోల్చినప్పుడు, స్త్రీలకు ఎక్కువ ఐరన్ అవసరం. ఎందుకంటే మహిళల పీరియడ్స్ సమయంలో వారి శరీరంలోని ఐరన్ కంటెంట్‌లో కొంత భాగాన్ని కోల్పోతారు. ఇలాంటి సమయాల్లో పోషకాల కొరత రక్తహీనతకు కారణమవుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..