AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Walnuts Benefits: చర్మాన్ని హైడ్రేట్ చేసి మెరిసేలా చేసే డ్రైఫ్రూట్..! రోజూ తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..!

వాల్‌నట్స్ తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, జింక్ వంటి పోషకాలు చర్మానికి మేలు చేస్తాయి. ఈ పోషకాలు చర్మాన్ని హైడ్రేట్ చేసి, ముడతలను తగ్గిస్తాయి. రోజూ వాల్‌నట్స్ తినడం వల్ల చర్మం, శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.

Walnuts Benefits: చర్మాన్ని హైడ్రేట్ చేసి మెరిసేలా చేసే డ్రైఫ్రూట్..! రోజూ తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..!
వాల్‌నట్స్‌ అతిగా తినడం వల్ల ఛాతిలో మంట, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. తొందరగా జీర్ణం కాకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. పోషకాల కోసం వాల్‌నట్స్‌ మీద అతిగా ఆధారపడటం మంచిది కాదు. దీనివల్ల మిగతా పోషకాల లోపం ఏర్పడుతుంది. వీటిని మితంగా తీసుకుంటూ మిగతా పోషకాహారం తీసుకోవాలి.
Prashanthi V
|

Updated on: Jan 24, 2025 | 9:49 PM

Share

ఈ డ్రైఫ్రూట్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..? రోజూ కొన్ని వాల్‌నట్స్ తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా, తక్కువ ముడతలతో మెరుస్తూ ఉండటమే కాకుండా.. అనేక ఇతర శరీర ప్రాముఖ్యతలు కూడా పొందవచ్చు. ఇవి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, విటమిన్ బి వంటి పోషకాలను కలిగి ఉంటాయి. ఈ పోషకాలు చర్మాన్ని హైడ్రేట్ చేసి దానిని యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి.

స్కిన్ మాయిశ్చరైజ్

వాల్‌నట్స్ లో ఉన్న ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని లోతుగా మాయిశ్చరైజ్ చేస్తాయి. ఇది చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండటానికి సహాయపడుతుంది. చర్మం పొడిబారితే దానికి మరింత సమస్యలు తలెత్తుతాయి. కానీ వాల్‌నట్స్ ఈ పరిస్థితిని నివారించి చర్మం మృదువుగా, నిగనిగలాడుతూ ఉంచుతుంది.

ముడతలకి వాల్‌నట్స్

ఈ రోజుల్లో చాలామంది చిన్న వయస్సులోనే ముడతల సమస్యతో బాధపడుతున్నారు. వాల్‌నట్స్‌లో ఉన్న యాంటీఆక్సిడెంట్లు చర్మం వృద్ధాప్య సంకేతాల నుండి రక్షణ కల్పిస్తాయి. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చర్మం యవ్వనంగా, ముడతలు లేకుండా ఉండటానికి చాలా సహాయపడుతుంది.

మొటిమలకి వాల్‌నట్స్

మొటిమలు ఎక్కువగా ఉండే వారు వాల్‌నట్స్ తీసుకుంటే వారికి మంచి ఫలితాలు వస్తాయి. ఇందులో ఉన్న జింక్, చర్మంలో నూనె ఉత్పత్తిని నియంత్రించి మొటిమలు తగ్గించడంలో సహాయపడుతుంది. జింక్, చర్మంలో బ్యాక్టీరియా పెరగకుండా నియంత్రణ సాధిస్తుంది. దీంతో మొటిమల సమస్య తగ్గిపోతుంది.

చర్మంపై మచ్చలు

చర్మంపై మచ్చలు, నల్లటి వలయాలు పోవడం కోసం చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. వాల్‌నట్స్‌లో ఉన్న విటమిన్ ఇ, బి కాంప్లెక్స్, చర్మం సమానమైన రంగును అందించడంలో సహాయపడతాయి. ఇవి చర్మ ఛాయను మెరుగుపరచడం ద్వారా మచ్చలు తగ్గించి, చర్మాన్ని అందంగా తయారు చేస్తాయి.

అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

రోజుకు 28 గ్రాముల వాల్‌నట్స్ తీసుకోవడం ద్వారా మీ చర్మం ఆరోగ్యం బాగుంటుంది. శరీరానికి ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కనీసం నాలుగు వాల్‌నట్స్ రోజూ నానబెట్టి తినడం, శరీరానికి, చర్మానికి మరిన్ని పోషకాలు అందించడానికి చాలా మంచిది. వాల్‌నట్స్ డైరెక్ట్‌గా కూడా తినొచ్చు, కానీ నానబెట్టి తినడం శరీరానికి మంచి ఫలితాలను అందిస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)