Mens Health Tips: పురుషులకు స్పెషల్.. ఆ రెండూ కలిసి తిసుకుంటే నెక్ట్స్ లెవల్ ఎనర్జీ..!

|

Aug 05, 2022 | 9:21 PM

ఎండు ద్రాక్ష తినడానికి రుచికరంగా ఉండటంతోపాటు అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎండు ద్రాక్షలో ప్రొటీన్లు, ఐరన్, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి.

Mens Health Tips: పురుషులకు స్పెషల్.. ఆ రెండూ కలిసి తిసుకుంటే నెక్ట్స్ లెవల్ ఎనర్జీ..!
Relationship
Follow us on

Benefits of eating honey and raisins : ఎండుద్రాక్షలో ఎన్నో పోషకాలున్నాయి. కిస్‌మిస్‌ను తీపి పదార్థాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఖీర్ లేదా హల్వా, తదితర తీపి వంటల్లో ఎండుద్రాక్ష లేకుండా ఆ రుచిని ఆస్వాదించలేం. ఎండు ద్రాక్ష తినడానికి రుచికరంగా ఉండటంతోపాటు అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎండు ద్రాక్షలో ప్రొటీన్లు, ఐరన్, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఏవైనా ఆహార పదార్థాలను ఎండుద్రాక్షతో కలిపి తీసుకుంటే దాని ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. అయితే.. తేనెలో కూడా ఎన్నో పోషకాలున్నాయి. తేనెను ఆయుర్వేద చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. తేనె – ఎండుద్రాక్ష తీసుకోవడం టెస్టోస్టెరాన్ హార్మోన్ను పెంచుతుంది. దీనితో పాటు ఇది పురుషుల శారీరక బలహీనతను తొలగించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా పురుషులు తేనె – ఎండుద్రాక్ష రెండూ కలిపి తింటే బోలెడన్ని ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తేనె – ఎండుద్రాక్ష తినడం వల్ల పురుషులకు కలిగే ప్రయోజనాలు..

ఎనర్జీ బూస్టర్: తేనె, ఎండుద్రాక్షలను కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. ఎండుద్రాక్షలోని పోషకాలు.. తేనెలో ఉండే కార్బోహైడ్రేట్లు, ఫ్రక్టోజ్, గ్లూకోజ్, పొటాషియం కలిసి శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. తేనె- ఎండు ద్రాక్షలను కలిపి తీసుకోవడం వల్ల పురుషులకు ఆకలి పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో బలహీనత అనిపిస్తే తేనె – కిస్‌మిస్‌లను రోజూ తింటే మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇమ్యూనిటీ బూస్టర్: తేనె – ఎండుద్రాక్షలను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎండుద్రాక్ష – తేనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఎండుద్రాక్ష – తేనెను ప్రతిరోజూ తీసుకుంటే అనేక వ్యాధుల నుంచి బయటపడవచ్చు.

వీర్యకణాల సంఖ్యను పెంచుతుంది: తేనె – ఎండుద్రాక్ష తీసుకోవడం వల్ల పురుషులలో లైంగిక బలహీనత తగ్గి స్టామినా పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎండుద్రాక్షలో రాగి, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అయితే తేనెలో అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవన్నీ పురుషులలో లైంగిక బలహీనతను తొలగించడంలో సహాయపడతాయి. అదే సమయంలో ఎండుద్రాక్ష – తేనె తీసుకోవడం ద్వారా ఇది స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరచడంలో, స్పెర్మ్ కౌంట్‌ను పెంచడంలో సహాయపడుతుందని పేర్కొంటున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి