Health: ఉదయాన్నే ఇవి 4 ఆకులు చాలు.. మీకు డాక్టర్‌తో పని ఉండదు..

తులసిలో ఔషధ గుణాలు పుష్కలం. దీన్ని చాలా సమస్యలకు హోమ్ రెమిడీగా అమ్మమ్మలు చెబుతుంటారు. ప్రస్తుతం రోజూ ఉదయాన్నే తులసి ఆకులను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవెంటో తెలుసుకుందాం,,,

Health: ఉదయాన్నే ఇవి 4 ఆకులు చాలు.. మీకు డాక్టర్‌తో పని ఉండదు..
Tulsi Leaves
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 31, 2024 | 3:22 PM

తులసి ఆకుల ప్రాముఖ్యత గురించి తెలుగు లోగిళ్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయుర్వేదం పరంగా కూడా తులసి ఔషధ గుణాలతో నిండి ఉంది. తులసిని టీలో చేర్చడం ద్వారా జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం మొదలైన సమస్యల నుండి ఉపశమనాన్ని పొందొచ్చు. రకరకాల వ్యాధుల నివారణకు చేసే కషాయాల్లో కూడా తులసిని వాడుతుంటారు. మన అమ్మమ్మల కాలం నుంచి తులసిని హొం రెమిడీగా వాడుతున్నారు.  అయితే రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో నాలుగు తులసి ఆకులను తింటే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం పదండి…

ప్రతి ఉదయం నాలుగు తులసి ఆకులను తినడం వల్ల చాలా ప్రయోజనాలు లభిస్తాయి. అయితే తులసిని నమిలి తినకుండా.. నీటిలో వేసుకుని తాగితే బెటర్.  ఆకులను నమిలి తినడం వల్ల దంతాలపై ఎనామిల్ పై పొర దెబ్బతింటుంది.

బరువు తగ్గించడంలో సహాయం చేస్తుంది

ప్రతిరోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటితో తులసి ఆకులను తీసుకోవడం వల్ల జీవక్రియను పెంచి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు రోజూ ఉదయం పూట నాలుగు తులసి ఆకులను నీటితో కలిపి తినాలి.

పదే పదే జబ్బు పడరు

మారుతున్న సీజన్‌లో వైరల్ వ్యాధుల బారిన పడడం సర్వసాధారణం. పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతిరోజూ ఉదయం తులసి తినడం ద్వారా మీరు ఈ వైరల్ ఆరోగ్య సమస్యల నుండి సురక్షితంగా ఉంటారు, ఎందుకంటే తులసి మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

శరీరం డిటాక్స్ అవుతుంది

రోజూ ఉదయాన్నే తులసిని నీళ్లతో కలిపి తీసుకుంటే శరీరంలోని విషపదార్థాలు తొలగిపోయి అనారోగ్యాన్ని కలిగించే టాక్సిన్స్ శరీరం నుంచి తొలగిపోతాయి. వాస్తవానికి, శరీరం తనను తాను డీటాక్స్ చేసుకుంటుంది. కానీ నేటి ఆహారం, పర్యావరణం రసాయనాలతో నిండి ఉంది. తద్వారా శరీరంలో టాక్సిన్స్ వేగంగా పేరుకుపోతాయి. ఇది అవయవాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. సో తులసి తీసుకుంటే బెటర్.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

ప్రతిరోజూ ఉదయం తులసి ఆకులను తినడం ద్వారా, మీ జీర్ణక్రియ క్రమంగా మెరుగుపడుతుంది. ఉబ్బరం, మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం, యాసిడ్ రిఫ్లక్స్ మొదలైన కడుపు సంబంధిత సమస్యల నుంచి రిలీఫ్ ఉంటుంది.

(NOTE: నిపుణుల సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఫాలో అయ్యేముందు డాక్టర్లను సంప్రదించండి)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.