Amla Benefits: ఉసిరితో అద్భుతమైన ప్రయోజనాలు.. ఆ సమస్యలకు మంచి ఔషధం..!

| Edited By: Ravi Kiran

Jun 11, 2022 | 6:52 AM

Amla Health Benefits: ఉసిరికాయతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఉసిరిలో విటమిన్‌ -సి ఎంతో మేలు చేస్తుంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే హర్మోన్‌లోని వ్యత్యాసాన్ని..

Amla Benefits: ఉసిరితో అద్భుతమైన ప్రయోజనాలు.. ఆ సమస్యలకు మంచి ఔషధం..!
Benefits Of Amla
Follow us on

Amla Health Benefits: ఉసిరికాయతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఉసిరిలో విటమిన్‌ -సి ఎంతో మేలు చేస్తుంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే హర్మోన్‌లోని వ్యత్యాసాన్ని పూడ్చడానికి, జలుబు లేదా దగ్గును నివారించడానికి ఉసిరికాయ ఎంతో ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మలబద్దకం, మధుమేహం వంటి వ్యాధులున్నవారికి ఎంతో మేలని, ఎన్నో రకాల వ్యాధులను తగ్గించేందుకు ఉసిరికాయ ఉపయోగపడుతుంది. ఉసిరి తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు నియంత్రించబడతాయి. ఉసిరి తినడం వల్ల చర్మ సమస్యలు, జట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఇందులో సి విటమిన్ ఉండటం వల్ల చర్మ వ్యాధుల నివారణకు సహాయపడుతుంది.ఉసిరిలో నారింజ పండ్ల కన్నా 20 శాతం ఎక్కువ విటమిన్‌ పోషకాలు ఉంటాయి. ఉసిరి చర్మపు ముడుతలను సైతం నివారిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కరోనా సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎంతో అవసరం. ఇది రక్తాన్ని శుభ్రం చేస్తుంది. మన తరచూ ఉసిరిని తీసుకున్నట్లయితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

ఇలా కూడా తింటే మంచిదే.. మనం నేరుగా ఉసిరిని ఎక్కువగా తినలేము కాబట్టి, దీనిని ఆహారంలో ఉడకబెట్టడం లేదా పచ్చడి చేయడం ద్వారా తినవచ్చు. తేనెతో కూడా తినవచ్చు. ఖాళీ కడుపుతో ఉసిరిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు వైద్యులు.

బరువు తగ్గేందుకు.. ఉసిరి జ్యూస్ తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను సైతం నియంత్రించుకోవచ్చు. ఇది శరీర బరువును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే, ఈ రసం రోజూ తాగడం వల్ల డయాబెటిస్ సమస్యను తొలగించుకోవచ్చు. అలాగే ఉసిరి రసం చర్మంపై నల్లటి మచ్చలను తొలగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖం మీద ఉసిరి రసం ఉంచడం వల్ల రంధ్రాలు పోతాయి. వేసవి వేడి నుంచి ఉపశమనం పొందడం కోసం ఉసిరి రసం తాగడం మంచిది. ఉసిరి రసం కేవలం దాహాన్ని తీర్చడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులో అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి