Drinking Water: ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండేందుకు క్రమం తప్పకుండా 10 నుంచి 12 గ్లాసుల నీటిని తాగాలి. అయితే కొంతమంది నీటిని తప్పుడు సమయంలో తాగుతుంటారని.. దీని కారణంగా శరీరం అనేక సమస్యలను ఎదుర్కొంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగాలా..? వద్దా..? తాగితే పరిస్థితి ఏంటీ.. అనే అనేక ప్రశ్నలు ప్రజల మదిలో మెదులుతుంటాయి. అయితే.. ఆహారం తిన్న తర్వాత నీరు తాగాలా వద్దా..? తాగితే ఎంత నీరు తీసుకోవాలి.. నీరు తాగడానికి సరైన సమయం ఏది.. అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఆహారం తీసుకున్న తర్వాత నీరు ఎప్పుడు తాగాలి?
ఆహారం తిన్న వెంటనే నీరు తాగకూడదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే మన జీర్ణక్రియ నిర్వహణ అప్పుడే ప్రారంభమవుతుంది. ఆహారం జీర్ణం కావడానికి 2 గంటలు పడుతుంది. అటువంటి పరిస్థితిలో.. తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణక్రియ వేడి వెంటనే చల్లబడతుంది. ఇది జీర్ణవ్యవస్థ పనిని ప్రభావితం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి ఆహారం తిన్న 45 నుంచి 60 నిమిషాల తర్వాత నీటిని తీసుకోవాలి. ఇది కాకుండా.. మీరు భోజనానికి అరగంట ముందు నీటిని కూడా తీసుకోవచ్చు. తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.
నీరు తాగడానికి సరైన సమయం ఇదే..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: