AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్యాటీ లివర్‌ ను తగ్గించే జ్యూస్..! అలసట పోతుంది.. రోజంతా జోరుగా కూడా ఉంటారు..!

మన శరీరంలో కాలేయం చాలా ముఖ్యమైన అవయవం. ఇది సరిగా పనిచేయాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం. ఈ మధ్య నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) అనే సమస్య చాలా మందిలో కనిపిస్తోంది. దీన్ని నివారించడంలో బీట్‌ రూట్ జ్యూస్ చాలా సహాయపడుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాలతో నిండి ఉంటుంది.

ఫ్యాటీ లివర్‌ ను తగ్గించే జ్యూస్..! అలసట పోతుంది.. రోజంతా జోరుగా కూడా ఉంటారు..!
Beetroot
Prashanthi V
|

Updated on: Jun 12, 2025 | 8:58 PM

Share

బీట్‌ రూట్‌ లో పొటాషియం, సోడియం, ఫాస్ఫరస్, కాల్షియం, మాగ్నీషియం, ఐరన్, జింక్ లాంటి ఎన్నో ఖనిజాలు ఉంటాయి. ఇందులో శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఫైబర్, చక్కెర, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బీట్‌రూట్ జ్యూస్ తాగితే శక్తి పెరుగుతుంది. కాలేయాన్ని శుభ్రపరచడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.

బీట్‌ రూట్‌ లో ఉండే బీటైన్ అనే పదార్థం కాలేయానికి చాలా అవసరం. ఇది శరీరంలో కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. దీని వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుంది. ఇది డిటాక్స్ ప్రక్రియను వేగవంతం చేస్తూ శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది.

శరీరంలో అలసట లేకుండా శక్తివంతంగా ఉండటానికి బీట్‌ రూట్ జ్యూస్ సహాయపడుతుంది. రోజూ కొంత బీట్‌ రూట్ జ్యూస్ తాగితే శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే నైట్రేట్ పదార్థం నైట్రిక్ ఆక్సైడ్‌ గా మారి రక్తనాళాలను విస్తరిస్తుంది. దీని వల్ల రక్త ప్రవాహం బాగా జరుగుతుంది. ఇది శరీరానికి తక్కువ ఒత్తిడితో రక్తాన్ని అందించేందుకు సహాయపడుతుంది.

బీట్‌ రూట్‌ లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో కణాల దెబ్బతినటాన్ని అరికట్టవచ్చు. దీని వల్ల కాలేయ కణాలు ఆరోగ్యంగా ఉండే అవకాశం పెరుగుతుంది. బీట్‌ రూట్ జ్యూస్ రోజూ తాగడం వల్ల కాలేయంపై ఒత్తిడి తగ్గుతుంది.

కొంతమంది బీట్‌ రూట్‌ ను ఉడకబెట్టి తింటారు. మరికొందరు జ్యూస్ రూపంలో తీసుకుంటారు. జ్యూస్ రూపంలో తీసుకుంటే శక్తి త్వరగా శరీరానికి అందుతుంది. ఇది జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. దీని వల్ల శరీరంలో అవసరం లేని పదార్థాలు త్వరగా బయటకు వెళ్తాయి.

ప్రతిరోజూ 100 మిల్లీలీటర్ల బీట్‌ రూట్ జ్యూస్ తాగితే దాదాపు 95 కిలో కేలరీల శక్తి, 22.6 గ్రాముల కార్బోహైడ్రేట్లు, కొంత ప్రొటీన్, కొవ్వు పదార్థాలు, ఫైబర్, సహజ చక్కెరలు లభిస్తాయి. ఇవన్నీ కలిసి శరీరానికి అవసరమైన అన్ని మినరల్స్‌ ను అందిస్తాయి.

పరిశోధనల ప్రకారం బీట్‌ రూట్ జ్యూస్ తాగడం వల్ల లివర్ ఎంజైమ్స్ చురుకుగా పనిచేస్తాయని కాలేయానికి మేలు జరుగుతుందని తేలింది. కాలేయం సహజంగా చేసే డిటాక్స్ ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఇది దీర్ఘకాలంలో కాలేయం ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.

బీట్‌ రూట్ జ్యూస్ కొవ్వు కాలేయ సమస్యను నివారించడమే కాక శరీరానికి శక్తిని అందించి కాలేయాన్ని చురుకుగా పనిచేసేలా చేస్తుంది. రోజూ పరిమిత మోతాదులో తీసుకుంటే.. దీర్ఘకాల కాలేయ ఆరోగ్యానికి ఇది ఒక అద్భుత సహాయకారిగా నిలుస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)