AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beer: చల్లగా ఉంటాయని తెగ తాగేస్తున్నారా.. అయితే మీ పని అయిపోయినట్లే..!

ఎండలు(summer) మండిపోతుండడంతో.. ఉపశమనం కోసం అత్యధికులు కూల్ డ్రింక్స్‌(Cool Drinks) తాగుతున్నారు. మందు అలవాటు ఉన్నవారు బీరు(Beer) తెగ తాగేస్తున్నారు...

Beer: చల్లగా ఉంటాయని తెగ తాగేస్తున్నారా.. అయితే మీ పని అయిపోయినట్లే..!
Beer
Srinivas Chekkilla
| Edited By: Ravi Kiran|

Updated on: May 03, 2022 | 7:18 AM

Share

ఎండలు(summer) మండిపోతుండడంతో.. ఉపశమనం కోసం అత్యధికులు కూల్ డ్రింక్స్‌(Cool Drinks) తాగుతున్నారు. మందు అలవాటు ఉన్నవారు బీరు(Beer) తెగ తాగేస్తున్నారు. గత ఏడాది తొలి నాలుగు నెలల్లో 1,06,42,143 పెట్టెల బీరు అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది జనవరి- ఏప్రిల్‌ వరకూ రాష్ట్రంలో 1,49,17,004 పెట్టెల సీసాలు అమ్ముడయ్యాయి. అంటే 45 శాతానికిపైగా బీరు విక్రయాలు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. బీరులో 5-7.5 శాతం, బ్రాందీ, విస్కీలలో 42.8 శాతం, వైన్‌లో 6-24 శాతం వరకూ ఆల్కహాల్‌ ఉంటుంది. ఇలాంటప్పుడు బీరే కదాని పరిమితికి మించి తాగేస్తే.. ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది. రోజుకు 90 ఎంఎల్‌ కంటే ఎక్కువ ఆల్కహాల్‌ తీసుకుంటే అది కాలేయంపై నేరుగా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. కాలేయం పరిమాణం కుంచించుకుపోయి పనితీరు దెబ్బతింటుందని వివరిస్తున్నారు. దీన్నే ‘లివర్‌ సిర్రోసిస్‌’ అంటారు. ఇప్పటికే కాలేయ సమస్యలున్నవారు, అధిక కొవ్వు, బరువు, మధుమేహంతో బాధపడుతున్నవారు.

కడుపులో జిగురు పొరను ఆల్కహాల్‌ దెబ్బతీస్తుంది. ఫలితంగా అల్సర్లు ఏర్పడి, రక్త వాంతులు.. విరేచనాల సమస్యలు ఎదురవుతాయి. కడుపులో మంట, ఛాతీలోకి ఆమ్లం ఎగబాకడం వంటి పరిస్థితులూ ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. వేసవిలో శీతల పానీయాలు కూడా ఎక్కువగా తాగుతుంటారు. వీటితో రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. ఊబకాయం బారినపడతారు. కాబట్టి బీర్లు, శీతల పానీయాలు మోతాదుకు మించి తీసుకోవడం అనారోగ్యకరమేనని నిపుణులు చెబుతున్నారు. బీరుకు బానిసలవ్వడం వల్ల స్థూలకాయులుగా మారతారు. నాడీ వ్యవస్థపై ఆల్కహాల్‌ ప్రభావం పడుతుంది.

బీరు ఎక్కువగా తీసుకున్నప్పుడు శరీరంలోని నీరు, సోడియం, పొటాషియం.. మూత్రం ద్వారా బయటకు పోతాయి. ఫలితంగా డీహైడ్రేషన్‌కు దారితీసే ప్రమాదముంది. గ్లూకోజ్‌ ఉత్పత్తిపై ఆల్కహాల్‌ ప్రభావం చూపుతుంది. ఫలితంగా మధుమేహుల్లో రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా తగ్గి.. ‘హైపోగ్లేసిమియా’ అనే ప్రమాదకరస్థితిలో కోమాలోకి వెళ్లే ప్రమాదముంది. వేసవిలో పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. నీళ్లు, ఉప్పు, చక్కెరతో కలిపినపానీయాన్ని తాగాలి. ఎండాకాలంలో నిమ్మరసాన్ని మించింది లేదని నిపుణులు చెబుతున్నారు.

Read Also..  Health Tips: వేసవిలో ఐస్ క్రీమ్ తింటే ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందా..! అసలు సంగతి తెలిస్తే షాకవుతారు..