Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

White Rice: వైట్ రైస్ తినటం తగ్గించకపోతే గుండెపోటు తప్పదా..? నిపుణుల హెచ్చరిక..

White Rice: మార్కెట్లో ఈ రోజుల్లో అనేక రకాల రైస్ వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఇవి తింటే షుగర్ రాదు, ఆరోగ్యానికి మంచిది అంటూ బ్రైన్ రైస్, బ్లాక్ రైస్ లను చాలా మంది ప్రమోచ్ చేస్తున్నారు. కానీ..

White Rice: వైట్ రైస్ తినటం తగ్గించకపోతే గుండెపోటు తప్పదా..? నిపుణుల హెచ్చరిక..
Eating White Rice
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Jun 02, 2022 | 6:02 PM

White Rice: మార్కెట్లో ఈ రోజుల్లో అనేక రకాల రైస్ వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఇవి తింటే షుగర్ రాదు, ఆరోగ్యానికి మంచిది అంటూ బ్రైన్ రైస్, బ్లాక్ రైస్ లను చాలా మంది ప్రమోచ్ చేస్తున్నారు. కానీ.. సహజంగా చూసుకుంటే వైట్ రైస్ తినేవారే మన దేశంలో ఎక్కువ. అందులోనూ దక్షిణాది రాష్ట్రాల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా తెల్లగా ఉండే అన్నాన్ని తినటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా గుండెపోటు సమస్య వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. షుగర్ బానిన పడ్డ వారు వైట్ రైస్ తినకుండా ఉండటం మంచిదని వారంటున్నారు. దీనిని తినటం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయని.. తద్వారా దుష్ప్రభావాలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

రోజూ మనం తినే తెల్లన్నంలో ముఖ్యమైన పోషకాలు ఉండవు. అందువల్ల ఈ అలవాటును తగ్గించుకోవాలని నిపుణులు అంటున్నారు. అన్నంతో కడుపు నింపుకోవటం వల్ల పోషకాల లోపం ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తులు వారి వయస్సులు, ఆరోగ్య పరిస్థితి, శరీర అవసరాలకు అనుగుణంగా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. వైట్ రైస్ ప్లేస్ లో బ్రౌన్ రైస్ వినియోగం ఉత్తమమని వారు అంటున్నారు. ఎక్కువగా ప్రోటీన్లు, విటమిన్లు ఉండే ఆహారాన్ని రోజు తీసుకోవాలని చెబుతున్నారు.

తెల్లన్నం తినడం వల్ల మెటబాలిక్ సండ్రోమ్ అనే సమస్య వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. నెలకు ఒకసారి మాత్రమే వైట్ రైస్ తినాలని అంటున్నారు. ఇలా చేయటం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం తక్కువ అని వారు సూచిస్తున్నారు. ఊబకాయం సమస్యతో ఇబ్బంది పడే వారు వైట్ రైస్ తినటం తగ్గించకపోతే బరువు మరింతగా పెరుగే ప్రమాదం ఉందని వారు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.