Health Tips: తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నారా? ఈ టిప్స్‌తో వెంటనే రిలాక్స్ అవ్వండి..

|

Oct 09, 2022 | 5:47 PM

ప్రస్తుత బిజీ లైఫ్‌లో చాలా మంది రకరకాల ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. ఎక్కువ శాతం ప్రజలు నడుము నొప్పితో బాధపడుతుండటం మనం చూస్తూనే ఉంటాం.

Health Tips: తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నారా? ఈ టిప్స్‌తో వెంటనే రిలాక్స్ అవ్వండి..
Back Pain
Follow us on

ప్రస్తుత బిజీ లైఫ్‌లో చాలా మంది రకరకాల ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. ఎక్కువ శాతం ప్రజలు నడుము నొప్పితో బాధపడుతుండటం మనం చూస్తూనే ఉంటాం. ఆ నడుము నొప్పి కారణంగా కూర్చోలేక, పడుకోలేక, తమ పనులను సరిగా చేసుకోలేక అవస్థలు పడుతుంటారు. అయితే, వెన్ను నొప్పికి ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంటుంది. ఆ నొప్పి తీవ్రమైతే.. వైద్యులను ఆశ్రయించక తప్పదు. అయితే, ప్రతీసారి వైద్యులను ఆశ్రయించాల్సిన అవసరం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి అనేక చిట్కాలు సూచిస్తున్నారు. వ్యాయామాలు, యోగా భంగిమలు ట్రై చేయడం ద్వారా వెన్ను నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చునని సూచిస్తున్నారు. కండరాలకు విశ్రాంతి ఇవ్వడానికి, నొప్పిని తగ్గించడానికి సహాయపడే కొన్ని హోమ్ రెమిడీస్‌ను ట్రై చేయొచ్చునని సూచిస్తున్నారు. మరి వెన్ను నొప్పి నివారణకు సహాయపడే చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

స్ట్రెచింగ్..

కండరాలు, స్నాయువులను సాగదీయడం(స్ట్రెచింగ్) ద్వారా వెన్ను నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. వెన్ను నొప్పి నుంచి రిలాక్స్ అవడానికి ఇది మంచి మార్గం. స్ట్రెచింగ్ ద్వారా కండరాలపై ఒత్తిడి తగ్గుతుంది. అది కండరాల నొప్పిని తగ్గిస్తుంది. నేల వైపు వంగి కాలి వేళ్లను తాకడం, రకరకాల భంగిమలతో స్ట్రెచింగ్ చేస్తే ప్రయోజనం ఉంటుంది.

మసాజ్..

వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లయితే ఉపశమనం పొందడానికి నొప్పి ఉన్న చోట మసాజ్ చేస్తే ఫలితం ఉంటుంది. మసాజ్ చేయడం వలన తక్షణమే రిలాక్స్ అవుతారు. వెన్ను నొప్పి నివారణకు అనేక రకాలుగా మసాజ్ చేయొచ్చు. ఇందుకోసం మసాజ్ ఆయిల్‌ను గానీ, ఆలీవ్ ఆయిల్ గానీ, కొబ్బరి నూనె గానీ వినియోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

వేడి పదార్థం, ఐస్ క్యూబ్స్..

వెన్ను నొప్పికి కాపడం పెట్టడం, ఐస్ క్యూబ్‌తో మసాజ్ చేయడం ద్వారా కూడా ప్రయోజనం ఉంటుంది. ఇలా చేయడం వలన వెన్ను నొప్పి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ప్రభావిత ప్రాంతంలో ఐస్ క్యూబ్‌తో మసాజ్ చేయాలి. లేదా వేడి నీటిలో క్లాత్ ముంచి మర్ధన చేయాలి. తద్వారా కండరాలు విశ్రాంతి పొందుతాయి. నొప్పిని తగ్గిస్తుంది.

మీరు వాడే షూ, చెప్పులను మార్చాలి..

సౌకర్యవంతంగా లేని బూట్లు, చెప్పుల కారణంగా కూడా వెన్ను నొప్పి వస్తుంది. అందుకే సౌకర్యవంతంగా ఉండే బూట్లు, చెప్పులను మాత్రమే వినియోగించాలి.

గమనిక: ఇందులో సమాచారం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ముందుగా వైద్యులను సంప్రదించాలి. వారి సలహా మేరకు ట్రీట్‌మెంట్ తీసుకోవాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.