ఇవి తింటే మొఖం మీద నల్ల మచ్చలు గ్యారెంటీ.. వీటికి దూరంగా ఉండండి

మన చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం పైకి క్రీములు రాసుకుంటే సరిపోదు. మనం తినే తిండి కూడా మన ముఖంపై వెంటనే ప్రభావం చూపిస్తుంది. కొన్ని రకాల ఆహారాలు తింటే మొటిమలు, మచ్చలు, నలుపు వంటివి వచ్చేస్తాయి. అలాంటి ఆహారాలు ఏంటో తెలుసుకొని వాటిని తక్కువగా తింటే మన ముఖం కాంతివంతంగా ఉంటుంది.

ఇవి తింటే మొఖం మీద నల్ల మచ్చలు గ్యారెంటీ.. వీటికి దూరంగా ఉండండి
Blackspots On Face

Updated on: May 08, 2025 | 6:44 PM

రోజూ తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. దీని ప్రభావంతో హార్మోన్ల సమతుల్యత తప్పిపోయే అవకాశం ఉంటుంది. ఈ మార్పుల కారణంగా ముఖంపై నల్లటి మచ్చలు, మొటిమలు వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి తీపి పదార్థాలు మితంగా తీసుకోవడం అవసరం.

పాలు, పెరుగు, చీజ్ వంటివి ఎక్కువగా తినడం వల్ల శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలో మార్పులు వస్తాయి. ఇది చర్మంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించవచ్చు. ఈ పరిస్థితులు ముఖంపై నలుపు మచ్చలు ఏర్పడేలా చేస్తాయి. కాబట్టి డైరీ ఫుడ్‌ ను అవసరానికి మించి తీసుకోవద్దు.

బర్గర్లు, పిజ్జాలు, నూనెలో వేయించిన ఆహారాల్లో మంచి పోషకాలు ఉండవు. ఇవి మన శరీరాన్ని చెడు పదార్థాలతో నింపుతాయి. దానివల్ల చర్మం బాగోదు మచ్చలు కూడా వస్తాయి.

చాక్లెట్లు తీపి పదార్థాలే కాకుండా.. వాటిలో పాల పదార్థాలు కూడా ఉంటాయి. ఈ రెండు కారణాల వల్ల ముఖంపై మచ్చలు రావడం, చర్మం పొడిబారడం లాంటి సమస్యలు వస్తాయి. చాక్లెట్లు లిమిటెడ్ గా తీసుకోవడం మంచిది.

అరటి పండ్లలో సహజంగా ఉన్న చక్కెరలు ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువగా తీసుకుంటే గ్లూకోజ్ స్థాయి పెరిగే అవకాశం ఉంటుంది. దీని ప్రభావం చర్మంపై కూడా పడుతుంది. మచ్చలు, మొటిమలు వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయి.

రోజుకు ఎక్కువ కాఫీ తాగితే శరీరంలోని హార్మోన్లు మారతాయి. కాఫీలో ఉండే కెఫీన్ వల్ల ముఖంపై మచ్చలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఖాళీ కడుపుతో తాగితే ఇది ఇంకా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.

ముఖం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా తీపి పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్, పాల పదార్థాలు తీసుకోకుండా ఉంటే చర్మాన్ని కాపాడుకోవచ్చు.