Muscle Cramps: సడెన్‌గా కండరాలు పట్టేసి కదలలేకపోతున్నారా..? ఈ రిలీఫ్ టెక్నిక్స్ మీ కోసమే!

Muscle Cramps Relief: సాధారణంగా అప్పుడప్పుడు కండరాలు పట్టేస్తూంటాయి. దీంతో కలు కదపలేం. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కాసేపు అక్కడే అలాగే కూర్చుండి పోతారు. ఇలా కండరాల నొప్పిని చాలా మంది ఫేస్ చేసే ఉంటారు. పూర్వం పెద్దవాళ్లకే ఇలా కండరాలు పట్టేసావి. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేదు. ఎవరికైనా పట్టేస్తున్నాయి.

Muscle Cramps: సడెన్‌గా కండరాలు పట్టేసి కదలలేకపోతున్నారా..? ఈ రిలీఫ్ టెక్నిక్స్ మీ కోసమే!
Muscle Pain

Edited By:

Updated on: Dec 26, 2023 | 5:50 PM

సాధారణంగా అప్పుడప్పుడు కండరాలు పట్టేస్తూంటాయి. దీంతో కలు కదపలేం. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కాసేపు అక్కడే అలాగే కూర్చుండి పోతారు. ఇలా కండరాల నొప్పిని చాలా మంది ఫేస్ చేసే ఉంటారు. పూర్వం పెద్దవాళ్లకే ఇలా కండరాలు పట్టేసావి. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేదు. ఎవరికైనా పట్టేస్తున్నాయి. జిమ్ కి వెళ్లే వాళ్లకు సైతం ఈ కండరాలు సడెన్ గా పట్టేస్తూంటాయి. కండరాలకు సరైన విధంగా ఆక్సిజన్ సరఫరా కాకపోవడం వల్ల.. కండరాలు పట్టేయడం, తిమ్మిరి రావడం జరుగుతుంది. అలాగూ డీహైడ్రేషన్, రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. మరి ఈ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందాలంటే.. ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

స్ట్రెచ్ చేయడం:

స్ట్రెచ్ చేయడం వలన చాలా సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇలా కండరాలు పట్టేసినప్పుడు కూడా స్ట్రెచ్ చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది. తేలికగా, సింపుల్ గా ఉన్న శరీరాన్ని వార్మ్ అప్ చేస్తాయి. దీని వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగ్గా ఉంటుంది. స్ట్రెచ్చింగ్ చేస్తే కండరాలు మరింత ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. ఎక్కువగా ఏ శరీర భాగాలపై ప్రెజర్ ఉంటుందో అలాంటి స్ట్రెచ్ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

మసాజ్:

కండరాల నొప్పి, పట్టేయడం, తిమ్మిరి రావడం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే.. మసాజ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ప్రస్తుతం మార్కెట్లో ఫోమ్ రోలర్లు లభ్యమవుతున్నాయి. వీటితో నొప్పి, తిమ్మిరి వంటి వాటిని తగ్గించు కోవచ్చు. ఇలా ఫోమ్ రోలర్స్ తో కూడా మసాజ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల నొప్పులు తగ్గడమే కాకుండా.. కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

హైడ్రేట్ గా ఉండాలి:

కండరాలు పట్టేయకుండ ఉండాలంటే.. తగినంత నీరు తీసుకోవాలి. దీనికి.. దానికి లింక్ ఏముంది అనుకుంటున్నారా… ఏ పని చేస్తున్నా.. లేక పోయినా తగినంత నీరు తాగుతూ ఉండాలి. బాడీలో తగింత నీరు ఉండటం వల్ల కండరాలు సరిగ్గా పని చేయడానికి హెల్ప్ అవుతాయి. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది.

సరైన ఆహారం:

సరైన ఆహారం తీసుకోవడం వల్ల కూడా కండరాలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. కండరాలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. మంచి ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్ల కండరాల నొప్పులు తగ్గించుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

Follow Us