
చాలా మంది కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ ఉంటాయి. ఈ నల్లటి వలయాల వల్ల వారి ముఖ అందమే పాడవుతుంది. సరిగ్గా నిద్ర పోని వారికి, డెస్క్ జాబ్స్ చేసే వారికి, అలర్జీలు ఉన్న వారికి, హైపర్ పిగ్మంటేషన్ ఉన్న వారికి, చర్మ సమస్యలు ఉన్న వారికి, ఐరన్ ఇలా కొన్ని సమస్యల వల్ల ఈ డార్క్ సర్కిల్స్ అనేవి వస్తాయి. అంతే కాకుండా థైరాయిడ్ ఉన్నా, నీళ్లు సరిగ్గా తాగకపోయినా ఈ సమస్య వేధిస్తుంది. ఈ నల్లటి వలయాలను వదిలించుకోవడానికి చాలా టిప్స్ పాటించి ఉంటారు. అయినా ఫలితం లేని వారు.. ఆహారంలో కొన్ని రకాల మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడొచ్చు.
శరీరంలో ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరగాలంటే ఐరన్ సరిపడినంత కావాలి. ఆకు కూరల్లో సరి పడినంతగా ఐరన్ ఉంటుంది. పాల కూర, బచ్చలి కూర వంటి ఆకు కూరల్లో ఐరన్ అనేది మెండుగా ఉంటుంది. ఇలా కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ ఉన్న వారు ఆకు కూరల్ని తప్పకుండా తినాలి.
చర్మాన్ని చక్కగా ఉంచడంలో ‘విటమిన్ ఈ’ అనేది బాగా ఉపయోగ పడుతుంది. అలాగే కళ్ల కింద నలుపుని తగ్గించడంలో ఇది హెల్ప్ అవుతుంది. విటమిన్ ఈలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల చర్మానికి కావాల్సని పోషణ.. శరీరం లోపల నుంచి అంది.. స్కిన్ మంచిగా కనిపిస్తుంది.
మనిషి ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే.. నిద్ర ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రతి రోజూ 8 గంటల పాటు నిద్రపోతే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. అంతే కాకుండా స్కిన్ కూడా మెరుస్తూ ఉంటుంది.
గుమ్మడి గింజలు, బాదం, అవకాడో, వేరు శనగ గింజలు, బంగాళ దుంప, లేట్యూస్, క్యాబేజ్, బ్రోకలీ వంటి వాటిని ఆహారంతో పాటు తీసుకుంటే చర్మం బాగవుతుంది. దీని వల్ల ఎలాంటి సమస్యలు ఉన్నా నయం అవుతాయి. అలాగే నీటికి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
ఇలా ఆహారంలో మార్పులు, చేర్పులు చేసుకుంటూ తీసుకోవడం వల్ల చర్మం అందంగా మారుతుంది. చర్మానికి సంబంధించిన ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే ముఖాన్ని క్లెన్సర్స్ తో క్లీన్ చేసుకుంటూ ఉండాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.