ప్రస్తుతం ఇప్పుడు చాలా మంది కిడ్నీల్లో రాళ్ల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. చిన్న పెద్దా అనే తేడా లేకుండా ఈ సమస్య అందరినీ వేధిస్తోంది. దీనికి ప్రధాన కారణం.. నీరు సరిగ్గా తాగక పోవడం అయితే.. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు కూడా మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడటానికి మరో కారణం అవుతున్నాయి. సాధారణంగా ఈ సమస్య ఎదురైనప్పుడు వైద్యులు పరీక్షించి.. రాళ్లు చిన్నగా ఉన్నట్లుయితే మందులు ఇస్తారు. లేదంటే శస్త్ర చికిత్స వరకూ వెళ్లాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ఆయుర్వేద చిట్కాలను కూడా ఉపయోగించి.. కిడ్నీలో రాళ్లను కరిగించుకోవచ్చు. ఇవి నేచురల్ గా దొరికే వాటితో చేస్తారు కాబట్టి.. ఈ చిట్కాలు వాడినా పెద్దగా దుష్ర్పభావాలు ఉండవు. మరి ఆ ఆయుర్వేద చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రణపాల ఆకు ఎంతగానో ఉపయోగ పడుతుంది:
మూత్ర పిండాల్లో ఏర్పడిన రాళ్లను తొలగించుకోవడంలో రణపాల ఆకు ఎంతగానో సహాయపడుతుంది. గుప్పెడు రణపాల ఆకులతో పాటు మూడు మిరియాలు, మూడు పచ్చి వెల్లుల్లి రెబ్బలను రోట్లో వేసుకుని మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం నుంచి రసాన్ని తీసి.. ఇలా తయారు చేసుకున్న రసాన్ని 50 ఎమ్ ఎల్ మోతాదులో రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల 15 నుండి 20 రోజుల్లోనే మూత్ర పిండాల్లో రాళ్ల సమస్య తగ్గుతుంది.
కొండపిండి ఆకు:
కొండ పిండి ఆకుతో కూడా కిడ్నీలో రాళ్లను తగ్గించుకోవచ్చు. దీని వల్ల మంచి ఫలితాలే వస్తాయి. కొండ పిండి ఆకును వేర్లతో సహా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని దంచి గిన్నెలో వేసి లీటర్ నీటిని పోసి మరిగించాలి. ఈ లీటర్ నీరు పావు లీటర్ అయ్యే వరకు బాగా మరిగించి వడకట్టాలి. నెక్ట్స్ ఈ నీటిలో పటిక బెల్లం వేసి కలిపి పరగడుపున తాగాలి. ఇలా ఈ ఆకు కషాయాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే.. మూత్ర పిండాల సమస్య తగ్గుతుంది.
అరటి చెట్టు:
అరటి చెట్టు లోపల ఉండే భాగం కూడా రాళ్ల సమస్యలను తగ్గిస్తుంది. ఈ భాగం నుంచి రసాన్ని తీసుకుని.. రోజూ తగిన మోతాదులో తాగుతూ ఉంటే రాళ్ల సమస్య నుంచి బయట పడవచ్చు.
పల్లేరు కాయ:
పల్లేరు కాయ తీగతో కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ తీగను దంచి నీటిలో వేసి మరిగించాలి. తర్వాత వీటిని ఈ నీటిని వడకట్టి పరగడుపున తాగుతూ ఉంటే.. మూత్ర పిండాల సమస్య తగ్గుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి