Bad Breath: నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే మీ సమస్యకు పరిష్కారం దొరికినట్లే..

నోటి దుర్వాసన సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటాం. ఇది ఎవరో ఒకరి సమస్య కాదు. దాదాపు చాలా మంది ఈనోటి దుర్వాసన సమస్యను ఎదుర్కొంటారు. అసలు ఈసమస్యకు కారణం తెలుసుకుంటే.. పరిష్కారం..

Bad Breath: నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే మీ సమస్యకు పరిష్కారం దొరికినట్లే..
Bad Breath Problems

Updated on: Aug 28, 2022 | 1:49 PM

Bad Breath: నోటి దుర్వాసన సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటాం. ఇది ఎవరో ఒకరి సమస్య కాదు. దాదాపు చాలా మంది ఈనోటి దుర్వాసన సమస్యను ఎదుర్కొంటారు. అసలు ఈసమస్యకు కారణం తెలుసుకుంటే.. పరిష్కారం ఇట్టే దొరుకుతుంది. చాలా మంది పడుకుని లేవగానే వారి నోరు కంపు కొడుతుంది. బ్రష్ చేసిన తర్వాత కూడా నోటి దుర్వాసన సమస్య పోదు. ఇలా జరగడానికి ప్రధాన కారణం.. నోటిలో లాలాజలం లేకపోవడమే. మనం రాత్రి పడుకున్నప్పుడు నోటిలో లాలాజలం ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో నోరు పొడిబారుతుంది. ఈలాలాజలం సాధారణంగా దుర్వాసన కలిగించే కణాలను బటయకి పంపుతుంది. నిద్రిస్తున్న సమయంలో లాలాజలం ఉత్పత్తి తగ్గిపోవటంతో నోటిలో బాక్టీరియా పెరిగిపోయి ఉదయం పూట దుర్వాసనగా అనిపిస్తుంది. ఈసమస్యకు చెక్ పెట్టేందుకు లేవగానే మొదట బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసుకున్నప్పటికి కొన్ని సార్లు నోటి దుర్వాసన అలాగే ఉంటుంది. నోటి దుర్వాసన అనేది వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, నోటి సంరక్షణకు తీసుకుంటున్న జాగ్రత్తలపై ఆధారపడి ఉంటుంది. ఈక్రింది జాగ్రత్తలు పాటిస్తే నోటి దుర్వాసన సమస్యకు గుడ్ బై చెప్పొచ్చు.

తిన్న తర్వాత నోరు శుభ్రం చేసుకోవాలి: ఏదైనా తిన్న తర్వాత నోటిని శుభ్రం చేసుకోవడం అలవాటుచేసుకోవాలి. భోజనం చేసిన తరువాత అయితే నోటిని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎక్కువ మంది తిన్న తర్వాత నీరు తాగి తమ పనుల్లో నిమగ్నమైపోతారు. పళ్లు లోపల, చిగుళ్లలో ఇరుక్కున ఆహారం సమయం గడిచే కొద్దీ నోటి దుర్వాసనను కలిగిస్తుంది. అందుకే ఏదైనా తిన్న తర్వాత నోటిని పుక్కిలించిడం, నీటితో నోరు కడుక్కోవడం వంటివి చేయాలి.

కనీసం రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి: నోటి దుర్వాసనను నివారించాలనుకునే వారు ప్రతిరోజూ రెండు సార్లు బ్రష్ చేసుకోవటం తప్పనిసరి. ఉదయం లేచిన తర్వాత, రాత్రి సమయాల్లో పడుకోవడానికి విశ్రమించేటప్పుడు దంతాలను బ్రష్ చేయటానికి ప్రయత్నించాలి. ఇప్పటికే రోజుకు రెండుసార్లు బ్రష్ చేస్తున్నప్పటికీ నోటి దుర్వాసన సమస్యను అనుభవిస్తుంటే, అలాంటి సందర్భంలో రోజుకు కనీసం ఒకసారైనా మౌత్ వాష్ లేదా ఫ్లాసింగ్ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఆహార నియమాలు: వెల్లుల్లి, ఉల్లిపాయలు, కాఫీ, ఆల్కహాల్ వంటివి నోటి దుర్వాసనను పెంచుతాయి. నోటి దుర్వాసనను అధిగమించాలని అనుకుంటే ఈ రకమైన ఆహారాలకి దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ వీటిని తినకుండా ఉండలేకపోతే వీటికి ప్రత్యామ్నాయ పదార్థాలను తీసుకోవడానికి ప్రయత్నించాలి.

హైడ్రేటెడ్ గా ఉండండి: నోటి దుర్వాసన సమస్యను నివారించటానికి నీరు అద్భుతంగా పనిచేస్తుంది. ముందు చెప్పినట్లుగా నోరు పొడిబారటం వలన అది దుర్వాసన కలిగిస్తుంది. అందుకే మనల్ని మనం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఎక్కువ నీరు తాగాలి.

చ్యూయింగ్ గమ్: నోటి దుర్వాసనను పోగొట్టడానికి ప్రత్యేకమైన చ్యూయింగ్ గమ్‌లు ఉంటాయి. వీటిలో మెంథాల్ నోటి సంరక్షణకు సహాయపడటమే కాకుండా దుర్వాసనను దూరం చేస్తుంది. చూయింగ్ గమ్ నములుతూ మాట్లాడకూడదు. చ్యూయింగ్ గమ్ నమిలేకొద్ది అది నోటి దుర్వాసనతో పోరాడుతుంది. అందుకు చ్యూయింగ్ గమ్ నమలేటప్పుడు ఎదుటివారితో మాట్లాడితే వారికి మన నుంచి ఎక్కువ దుర్వాసన వస్తుంది. అందుకే ఈసమయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. పై చిట్కాలు ఫాలో అవుతున్నా.. నోటి దుర్వాసన సమస్య తగ్గకపోతే డెంటిస్టును సంప్రదించి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..