Constipation: ప్రసవం తర్వాత మహిళల్లో పెరుగుతున్న మలబద్ధకం.. ఈ సింపుల్‌ చిట్కాలతో ఉపశమనం పొందండి

మలబద్ధకం సమస్య నుండి బయటపడాలంటే, వివిధ రకాల ఇంటి నివారణలను అనుసరించవచ్చు. ముఖ్యంగా మలబద్ధకం నుండి బయటపడాలంటే పుష్కలంగా నీరు తాగడం, అలాగే హైడ్రేటెడ్ గా ఉండటం చాలా అవసరం.

Constipation: ప్రసవం తర్వాత మహిళల్లో పెరుగుతున్న మలబద్ధకం.. ఈ సింపుల్‌ చిట్కాలతో ఉపశమనం పొందండి
Constipation

Updated on: Nov 01, 2022 | 1:50 PM

అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లతో మలబద్ధకం తలెత్తుతాయి. అయితే మహిళలు గర్భం ధరించినప్పుడు అలాగే ప్రసవం తర్వాత ఈ సమస్యలు మరింత ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. అయితే డెలివరీ తర్వాత మహిళల్లో ఇది సహజంగా తలెత్తే సమస్యేనని, అలాగనీ జాగ్రత్తపడకపోతే సమస్య మరింత తీవ్రతరం కావొచ్చంటున్నారు నిపుణులు. నిజానికి, ఈ సమయాల్లో శరీరంలోని ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ హార్మోన్లు వేగంగా పెరుగుతాయి. ఇది గర్భాశయంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి మహిళల్లో మలబద్ధకం సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య ఎక్కువ కాలం కొనసాగితే కడుపులో గ్యాస్ ఏర్పడటం, అసౌకర్యం, వాంతులు, కడుపునొప్పి తదితర ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఈ మలబద్ధకం సమస్య నుండి బయటపడాలంటే, వివిధ రకాల ఇంటి నివారణలను అనుసరించవచ్చు. ముఖ్యంగా మలబద్ధకం నుండి బయటపడాలంటే పుష్కలంగా నీరు తాగడం, అలాగే హైడ్రేటెడ్ గా ఉండటం చాలా అవసరం. రోజుకు కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు తాగాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇది మలబద్ధకం సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతుంది.

ఓట్స్ బాగా తినండి

ఓట్స్‌లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. అలాగే తృణధాన్యాలు, బ్రౌన్ రైస్, బీన్స్, తాజా కూరగాయలు, పండ్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేస్తుంది. మలబద్ధకం లాంటి సమస్యలు దూరమవుతాయి.

తేలికపాటి వ్యాయామాలు..

జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేయడానికి మనం రోజుకు కనీసం 30 నిమిషాలు నడవాలి. అలాగే మలబద్ధకం నుండి ఉపశమనం పొందడానికి త్రికోణాసనం వంటి సింపుల్‌ ఆసనాలను ట్రై చేయవచ్చు. అయితే సిజేరియన్ చేయించుకున్న మహిళలు ఏదైనా వ్యాయామం ప్రారంభించే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

ఇవి కూడా చదవండి

ఒత్తిడితో..

ప్రెగ్నెన్సీ సమయంలో, అలాగే ప్రసవం తర్వాత మహిళల్లో పలు మార్పులు సంభవిస్తాయి. ఒత్తిడి, మానసిక ఆందోళన వంటి సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి. వీటి నుంచి ఉపశమనం పొందేందుకు యోగా, ధ్యానం వంటివి చేస్తే మంచిది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

రిన్ని హెల్త్ వార్తల కోసం  క్లిక్ చేయండి