Health Tips: ఎమోషనల్ గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా.. గుండె ప్రమాదాలు ఎవస్తాయి జాగ్రత్త!!

| Edited By: Ravi Kiran

Oct 04, 2023 | 5:30 PM

మీరు తరచూ ఆందోళన, నిరాశ, భయం, విచారం, ఒత్తిడికి గురవుతున్నారా. దీని వల్ల గుండె ప్రమాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా. ఇటీవల జరిగిన అధ్యయనాల ప్రకారం.. ఎక్కువగా ఒత్తిడి, విచారం, నిరాశకు గురైన సమయంలో బాడీలో కాటే కొలమైన్ అనే ఒత్తిడి హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీని వల్ల ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది. దీంతో శరీరం చురుకుగా స్పందించేలా చేస్తుంది. బాడీ ఎక్కువగా యాక్టీవ్ అయితే.. గుండె వేగంగా కొట్టుకుంది. ఇలా వేగంగా..

Health Tips: ఎమోషనల్ గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా.. గుండె ప్రమాదాలు ఎవస్తాయి జాగ్రత్త!!
Heart Attack And Gym
Follow us on

మీరు తరచూ ఆందోళన, నిరాశ, భయం, విచారం, ఒత్తిడికి గురవుతున్నారా. దీని వల్ల గుండె ప్రమాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా. ఇటీవల జరిగిన అధ్యయనాల ప్రకారం.. ఎక్కువగా ఒత్తిడి, విచారం, నిరాశకు గురైన సమయంలో బాడీలో కాటే కొలమైన్ అనే ఒత్తిడి హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీని వల్ల ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది. దీంతో శరీరం చురుకుగా స్పందించేలా చేస్తుంది. బాడీ ఎక్కువగా యాక్టీవ్ అయితే.. గుండె వేగంగా కొట్టుకుంది. ఇలా వేగంగా కొట్టుకోవడం వల్ల పలు సమస్యలకు దారి తీస్తుంది. దీంతో రక్త పోటు, హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ వంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అధ్యయనాల్లో తేలింది.

ఒత్తిడి కారణంగా గుండెలో అనేక మార్పులు:

చాలా మంది కుటుంబంలోని గొడవల వలన, ఆర్థిక ఇబ్బందుల వలన, వ్యాపారాల్లో నష్టాలు, ప్రేమ, పెళ్లి ఇలా అనే వాటి వల్ల ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అప్పుడప్పుడు స్ట్రెస్ కి గురైతే పర్వాలేదు కానీ.. తరచూ ఉంటే మాత్రం దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా గుండెలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఒత్తిడికి గురవ్వడం వల్ల గుండె లయలో మార్పలు వస్తాయి. హార్ట్ కండరాలకు సరైన విధంగా రక్త సరఫరా అందదు. దీంతో మెదడులో రక్తం గడ్డ కడుతుంది. ఫలితంగా ఎటాక్స్, స్ట్రోక్స్ వస్తాయి. దీర్ఘకాలికంగా స్ట్రెస్ కి గురవ్వడం వల్ల మధు మేహం కూడా వస్తుందని, బ్లడ్ లో షుగర్ లెవల్స్ కూడా పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

చెడు అవాట్లు పెరుగుతాయి:

మానసిక ఒత్తిడికి గురవ్వడం వల్ల చెడు అలవాట్లు పెరుగుతాయి. ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడటానికి చాలా మంది ఆల్కహాల్, ధూమ పానం వంటి వాటికి బానిసలుగా మారతారని అధ్యయనాల్లో తేలింది. ఈ కారణాలు కూడా గుండె జబ్బులు, మరణాలకి దారి తీస్తుందని అధ్యయనాల్లో నిపుణులు పేర్కొన్నారు.

నిద్ర లేమి సమస్యలు ఎదురవుతాయి:

ఎక్కువగా ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి వాటి కారణంగా మనిషి ఆలోచనలో పడతాడు. దీంతో ఏవేవో ఆలోచనలు చుట్టుముడతాయి. దీంతో నిద్ర సరిగ్గా పట్టదు. నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల రక్త పోటు, మధు మేహం, క్యాన్సర్, బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. అంతే కాకుండా నిద్ర లేమితో బాధ పడేవారు ఏ పని మీద దృష్టి పెట్టరు. శారీరక శ్రమ కూడా ఉండదు. దీంతో గుండె జబ్బులు మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు లేకపోలేదు.

ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుంది:

మానసిక ఒత్తిడితో బాధ పడేవారు పదే పదే జరిగిపోయిన వాటి గురించే ఆలోచిస్తూంటారు. ఒంటరిగా ఉండటానికే ఇష్ట పడతారు. ఈ ఒత్తిడి, ఆందోళన, నిరాశ కాస్తా డిప్రెషన్ లోకి తీసుకెళ్తాయి. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.