AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple Seeds: యాపిల్‌గింజలను తింటున్నారా? అయితే మీరు డేంజర్‌లో పడినట్లే.. పరిశోధనల్లో షాకింగ్‌ విషయాలు

Apple Seeds Side Effects: రోజూ ఒక యాపిల్ తింటే పలు రోగాలను దూరం చేసుకోవచ్చునని డాక్టర్లు చెబుతుంటారు. వారు చెప్పినట్లే ఈ పండులో బోలెడు పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్లు, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరాన్ని పలు వ్యాధుల నుండి దూరంగా ఉంచుతాయి

Apple Seeds: యాపిల్‌గింజలను తింటున్నారా? అయితే మీరు డేంజర్‌లో పడినట్లే.. పరిశోధనల్లో షాకింగ్‌ విషయాలు
Apple Seeds
Basha Shek
|

Updated on: Sep 09, 2022 | 4:03 PM

Share

Apple Seeds Side Effects: రోజూ ఒక యాపిల్ తింటే పలు రోగాలను దూరం చేసుకోవచ్చునని డాక్టర్లు చెబుతుంటారు. వారు చెప్పినట్లే ఈ పండులో బోలెడు పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్లు, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు  మన శరీరాన్ని పలు వ్యాధుల నుండి దూరంగా ఉంచుతాయి. ఈ సంగతి పక్కన పెడితే మనలో చాలామంది గింజలు తీసేసి యాపిల్‌ను తింటుంటారు. అయితే కొందరు మాత్రం గింజలు కూడా తినేస్తుంటారు. అయితే ఇలా తినడం వల్ల పలు సమస్యలు తలెత్తుతాయట. దీనికి సంబంధించి యాపిల్ విత్తనాలపై ఇటీవల జరిపిన శాస్త్రీయ పరిశోధనలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

అధికంగా తింటే ముప్పు తప్పదు..

యాపిల్ గింజల్లో అమిగ్డాలిన్ అనే విష సమ్మేళనం ఉంటుంది. వీటిని తిన్నా, నమిలిలా అమిగ్డాలిన్ హైడ్రోజన్ సైనైడ్‌గా మారుతుంది. ఇది శరీరానికి చాలా హానికరం. అందుకే పెద్ద మొత్తంలో యాపిల్‌ గింజలను తీసుకోకూడదంటున్నారు పరిశోధకులు. అమిగ్డాలిన్ సాధారణంగా రోసేసి కుటుంబానికి చెందిన పండ్ల విత్తనాలలో అధిక మొత్తంలో ఉంటుంది. ఆపిల్‌, బాదం, ఆప్రికాట్లు, పీచెస్, చెర్రీస్ తదితర పండ్లలో ఇది ఎక్కువగా ఉంటుంది. దీనిని విషంగా పరిగణిస్తారు. ఇది శరీరంలోని కణాలకు ఆక్సిజన్ చేరకుండా చేస్తుంది. చిన్న మొత్తంలో సైనైడ్ శరీరానికి స్వల్పకాలిక తేలికపాటి నష్టాన్ని కలిగిస్తుంది. ఇందులో తలనొప్పి, గందరగోళం, అలసట, నీరసం తదితర సమస్యలు తలెత్తుతాయి. ఇక శరీరంలో సైనైడ్ ఎక్కువగా ఉంటే అధిక రక్తపోటు, స్ట్రోక్స్, మూర్ఛ వంటి తీవ్రమైన సమస్యలు కలుగుతాయి. ఒక్కోసారి కోమాలోకి వెళ్లి మరణం కూడా సంభవించవచ్చు. అమిగ్డాలిన్ పరిమాణం యాపిల్ రకాన్ని బట్టి ఉంటుంది. అమిగ్డాలిన్ ప్రాణాంతకం కానప్పటికీ శరీరానికి హానికరం అని చెప్పుకోవాలి. అందుకే చిన్న పిల్లలకు గింజలు తీసేసిన యాపిల్‌ను తినిపించాలంటున్నారు నిపుణులు. 2015 పరిశోధనల ప్రకారం, ఒక గ్రాము ఆపిల్ గింజలలో అమిగ్డాలిన్ ఒకటి నుంచి నాలుగు మిల్లీగ్రాముల మధ్య ఉంటుంది. ఇది వివిధ రకాల ఆపిల్‌లను బట్టి ఉంటుంది. అయితే, విత్తనాల నుంచి విడుదలయ్యే సైనైడ్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. 50-300 mg హైడ్రోజన్ సైనైడ్ ప్రాణాంతకం కావచ్చు. ఒక గ్రాము ఆపిల్ గింజలో 0.6 mg హైడ్రోజన్ సైనైడ్ ఉంటుంది. అంటే 80 నుంచి 500 గింజలు తింటే మనిషికి ప్రాణాపాయం తప్పదు. ఇక పరిశోధనలో, శాస్త్రవేత్తలు అమిగ్డాలిన్‌ను నివారించడానికి, యాపిల్స్ తినడానికి, యాపిల్ జ్యూస్ తాగే ముందు వాటి విత్తనాలను తొలగించడం మంచిదని సలహా ఇచ్చారు. . ముఖ్యంగా పిల్లలకు ఆపిల్ గింజలు తీసిన తర్వాత తినిపించాలి.

ఇవి కూడా చదవండి

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు టీవీ9 నిర్ధారించలేదు. వీటిని సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఎటువంటి చికిత్స/మందు/ఆహారాన్నైనా  అనుసరించే ముందు డాక్టర్ ని సంప్రదించి, సరైన నిర్ణయం తీసుకోండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..