AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ పండు మస్తు పని చేస్తుంది.. ఇంకా ఎన్నో లాభాలు..!

డ్రాగన్ ఫ్రూట్‌ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు బాగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగాలు రాకుండా కాపాడుతాయి. వైరస్, బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఉంటాయి. ఈ పండు తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది.

క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ పండు మస్తు పని చేస్తుంది.. ఇంకా ఎన్నో లాభాలు..!
Dragon Health Benefits
Prashanthi V
|

Updated on: May 07, 2025 | 3:08 PM

Share

డ్రాగన్ ఫ్రూట్‌ లో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. సాచురేటెడ్ కొవ్వులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల గుండె బలంగా ఉంటుంది. హృదయ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్‌లో బీటాసయానిన్స్, ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటితో పాటు విటమిన్ సి కూడా శరీరానికి అందుతుంది. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. దీంతో క్యాన్సర్ కణాలు పెరగకుండా ఉండే అవకాశం ఉంటుంది.

ఈ పండులో కాల్షియం, మెగ్నీషియం లాంటి పోషకాలతో పాటు ఫాస్పరస్ కూడా ఉంటుంది. ఇవి ఎముకలకు అవసరమైన పోషకాలు. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ఎముకల బలహీనత రాకుండా ఉంటుంది.

డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కేలరీలు మాత్రం చాలా తక్కువ. ఈ పండు తిన్నప్పుడు కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతో ఎక్కువగా తినకుండా ఉండే అవకాశం ఉంటుంది. బరువు అదుపులో ఉంచుకోవడానికి ఇది సహాయపడుతుంది.

డ్రాగన్ ఫ్రూట్‌లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పేగులకు ఉపయోగపడుతుంది. జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. పేగుల ఆరోగ్యం మెరుగవుతుంది.

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగవు. అందువల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువ అవుతాయి. డయాబెటిస్‌ను నియంత్రించుకోవాలనుకునేవారికి ఇది మంచిది.

ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి సహాయపడతాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. ముడతలు ఏర్పడకుండా ఉంటాయి. వయసు పెరిగినా చర్మం కాంతివంతంగా, యవ్వనం ఉట్టిపడేలా ఉంటుంది.

డ్రాగన్ ఫ్రూట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు మందంగా, పొడవుగా పెరుగుతుంది. జుట్టు ఆరోగ్యంగా కనిపించేందుకు ఇది సహాయపడుతుంది.

Follow Us
గోల్డ్ లోన్లకు ఎందుకంత క్రేజ్? ఇప్పుడు వాళ్లు కూడా బంగారం తాకట్టు
గోల్డ్ లోన్లకు ఎందుకంత క్రేజ్? ఇప్పుడు వాళ్లు కూడా బంగారం తాకట్టు
గోల్డ్ మెడల్ కోసం పోరు.. మరికొద్దిసేపట్లో మ్యాచ్..
గోల్డ్ మెడల్ కోసం పోరు.. మరికొద్దిసేపట్లో మ్యాచ్..
ఆదిలాబాద్ రిమ్స్‌‌లో ఘోర ప్రమాదం.. ఏసీ పేలి ఇద్దరు చిన్నారుల మృతి
ఆదిలాబాద్ రిమ్స్‌‌లో ఘోర ప్రమాదం.. ఏసీ పేలి ఇద్దరు చిన్నారుల మృతి
అడ్వాన్స్ బుకింగ్స్‏లో ది ప్యారడైజ్ విధ్వంసం..
అడ్వాన్స్ బుకింగ్స్‏లో ది ప్యారడైజ్ విధ్వంసం..
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌