Peanuts Benfits: ఎండాకాలం వేరుశెనగ గింజలు నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు..!

|

Apr 01, 2022 | 2:43 PM

Peanuts Benfits: వేరుశెనగ గింజలని అందరూ ఇష్టపడతారు. శీతాకాలంలో వీటిని ఎక్కువగా వేయించి తినడానికి ఇష్టపడతారు. అయితే వేసవిలో నానబెట్టి తింటే చాలా మంచిది. వేసవిలో

Peanuts Benfits: ఎండాకాలం వేరుశెనగ గింజలు నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు..!
Soaking Peanuts
Follow us on

Peanuts Benfits: వేరుశెనగ గింజలని అందరూ ఇష్టపడతారు. శీతాకాలంలో వీటిని ఎక్కువగా వేయించి తినడానికి ఇష్టపడతారు. అయితే వేసవిలో నానబెట్టి తింటే చాలా మంచిది. వేసవిలో వేయించిన వేరుశెనగను తింటే గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ పరిస్థితిలో వేయించిన వేరుశెనగకు బదులుగా పచ్చి వేరుశెనగ తింటే ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా నానబెట్టిన వేరుశెనగలను తినడం వల్ల స్థూలకాయం, బలహీనమైన కండరాల సమస్యలని అధిగమించవచ్చు. నానబెట్టిన పచ్చి శనగలను తినడం ద్వారా క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను నివారించవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ను నివారించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. అలాగే అనేక ఇతర పోషకాలు కూడా ఇందులో ఉంటాయి. ఇది క్యాన్సర్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

వేసవిలో గ్యాస్, ఎసిడిటీ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించాలంటే రోజూ నానబెట్టిన వేరుశెనగలను తినండి. ఇందులో ఉండే పొటాషియం, కాపర్, కాల్షియం, మాంగనీస్, ఐరన్ మొదలైన పోషకాలు పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. నానబెట్టిన పచ్చి వేరుశెనగలను ఖాళీ కడుపుతో తినడం ద్వారా గ్యాస్, అసిడిటీ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది కాకుండా రాత్రిపూట భారీగా తినాలనే కోరిక లేకపోతే మీరు వీటిని డిన్నర్‌లో చేర్చుకోవచ్చు.

నానబెట్టిన వేరుశెనగలను తినడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో రక్త ప్రసరణ వేగంగా జరుగుతుంది. దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. పచ్చి వేరుశెనగను తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నానబెట్టిన వేరుశెనగలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెరను నియంత్రించడంతోపాటు మధుమేహం వంటి సమస్యలను నివారించవచ్చు. మీరు వేరుశెనగ రుచిని మెరుగుపరచడానికి సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. నానబెట్టిన పచ్చి వేరుశెనగ తినడం ద్వారా శరీరంలో ఐరన్ లోపం తొలగిపోతుంది. అలాగే ఇది రక్త ప్రసరణకు చాలా మంచిది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి

Health Tips: కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నారా.. ఈ ఆహారాలకి దూరంగా ఉండటం మంచిది..!

Basil water: తులసి నీరు అత్యంత పవిత్రం.. ఈ సమస్యలకి చక్కటి పరిష్కారం..!

Viral Video: వర్షంలో తడుస్తున్న పిల్లలని రక్షించేందుకు తల్లి పక్షి ఆరాటం.. నెటిజన్ల హృదయాన్ని తాకిన వీడియో..!