AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వర్షంలో తడుస్తున్న పిల్లలని రక్షించేందుకు తల్లి పక్షి ఆరాటం.. నెటిజన్ల హృదయాన్ని తాకిన వీడియో..!

Viral Video: ఈ లోకంలో తల్లికి మించిన దైవం మరొకటి లేదు. ఈ భూమి మీద కదిలే దైవం తల్లి. అందుకే ప్రజలు తల్లిని దేవుడి కంటే ఎక్కువగా ఆరాధిస్తారు. ఏ తల్లి అయినా

Viral Video: వర్షంలో తడుస్తున్న పిల్లలని రక్షించేందుకు తల్లి పక్షి ఆరాటం.. నెటిజన్ల హృదయాన్ని తాకిన వీడియో..!
Mother Bird
Follow us
uppula Raju

|

Updated on: Apr 01, 2022 | 11:34 AM

Viral Video: ఈ లోకంలో తల్లికి మించిన దైవం మరొకటి లేదు. ఈ భూమి మీద కదిలే దైవం తల్లి. అందుకే ప్రజలు తల్లిని దేవుడి కంటే ఎక్కువగా ఆరాధిస్తారు. ఏ తల్లి అయినా తన పిల్లలు ఆపదలో ఉంటే తట్టుకోలేదు. అంతేకాదు వారికి చిన్నపాటి కష్టం కూడా రానివ్వకుండా చూసుకుంటుంది. అది మనిషి అయినా పశువు అయినా తల్లి ప్రేమలో తేడా ఉండదు. తాజాగా సోషల్‌ మీడియాలో ఒక వీడియో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో నెటిజన్ల హృదయాలని గెలుచుకుంది. ఇందులో ఒక తల్లి పక్షి తన పిల్లల కోసం పడే ఆరాటం మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో గూడులో ఉన్న ఒక పక్షి పిల్లలు భారీ వర్షంలో తడుస్తూ ఉంటాయి. ఈ విపత్తుని గమనించిన తల్లి పక్షి తన పిల్లలని ఎలాగైనా కాపాడాలనుకుంటుంది. వెంటేనే వాటి దగ్గరకు చేరుకొని తన రెక్కలతో పిల్లలని తడవకుండా రక్షించడానికి ప్రయత్నిస్తుంది. చాలాసేపు అలాగే ఉండిపోతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తల్లిపక్షిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోని IFS అధికారి సుశాంత్ నందా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. వార్తలు రాసే సమయానికి 37 వేల మందికి పైగా చూశారు. దీంతో పాటు తల్లి పక్షిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఒక నెటిజన్‌ ఇలా అన్నాడు ‘ తల్లి హృదయానికి అవధులు లేవు’. మరొక నెటిజన్ ‘ ఈ లోకంలో తల్లికి మించిన దైవం లేదు’ అన్నాడు. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్‌ తెలియజేయండి.

Viral Video: తాగుబోతు పెళ్లికొడుకు.. అమ్మాయికి బదులు అత్తగారి మెడలో మాల..!

Knowledge: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నాణేం.. దీని ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

ICICI Bank: వడ్డీ రేట్లని పెంచిన ఐసీఐసీఐ.. కొత్త రేట్లు ఏంటో తెలుసుకోండి..!