Viral Video: తాగుబోతు పెళ్లికొడుకు.. అమ్మాయికి బదులు అత్తగారి మెడలో మాల..!

Viral Video: సోషల్‌ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో వివాహ వీడియోలని నెటిజన్లు బాగా ఇష్టపడుతారు. కామెంట్స్‌, లైక్స్‌ చేస్తూ హోరెత్తిస్తారు.

Viral Video: తాగుబోతు పెళ్లికొడుకు.. అమ్మాయికి బదులు అత్తగారి మెడలో మాల..!
Drunk Groom
Follow us
uppula Raju

|

Updated on: Apr 01, 2022 | 10:01 AM

Viral Video: సోషల్‌ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో వివాహ వీడియోలని నెటిజన్లు బాగా ఇష్టపడుతారు. కామెంట్స్‌, లైక్స్‌ చేస్తూ హోరెత్తిస్తారు. ఎందుకంటే ఇవి చాలా ఆసక్తిగా ఉంటాయి. వధూవరులకి సంబంధించిన వీడియోలైతే మరి ఉత్సాహంగా చూస్తారు. వివాహ సందర్భంలో చాలా వింత వింత సంఘటనలు జరుగుతుంటాయి. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తాయి. తాజాగా ఓ వివాహానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఈ వీడియో చూస్తే మీరు నవ్వకుండా ఉండలేరు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో వరుడు మద్యం మత్తులో కనిపిస్తాడు. స్టేజ్‌పై నిలబడి ఉంటాడు కానీ అతడు సోయిలో ఉండకపోవడం మనం గమనించవచ్చు. సరిగ్గా ఇదే సందర్భంలో వరుడు.. వధువు మెడలో మాల వేయాల్సిన సమయం వస్తుంది. కానీ వరుడు ఏమి అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటాడు. మాల వధువు మెడలో వేయడానికి బదులు అత్తగారి మెడలో వేయబోతాడు. సరిగ్గా అప్పుడే అతడి చుట్టు ఉన్న వ్యక్తులు ఈ పనిచేయకుండా ఆపుతారు. తర్వాత వధువు మెడలో వేయాల్సిందిగా సూచిస్తారు. కానీ అతడు ఆ పని కూడా చేయడు. మద్యం మత్తులో వధువు మెడలో మాల వేస్తూనే కింద పడిపోతాడు. ఇది చూసిన వధువు ఆశ్చర్యపోతుంది.

ఈ వీడియో చూసిన నెటిజన్ల వరుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేశాడు. ఇప్పటి వరకు ఈ వీడియోని వేల సంఖ్యలో చూశారు. కామెంట్ల ద్వారా తమ స్పందనని తెలియజేస్తున్నారు. ఒక నెటిజన్ ‘ తాగుబోతు వ్యక్తికి పెళ్లి అవసరమా అని ప్రశ్నించాడు’ ఇంకొకరు ‘పెళ్లి రోజు కూడా తాగాలా’ అంటూ మండిపడ్డాడు. చాలామంది పెళ్లికొడుకి తీరుని తప్పుబట్టారు. ఈ పెళ్లి తర్వాత వధువు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్ తెలియజేయండి.

Knowledge: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నాణేం.. దీని ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

ICICI Bank: వడ్డీ రేట్లని పెంచిన ఐసీఐసీఐ.. కొత్త రేట్లు ఏంటో తెలుసుకోండి..!

Health News: అన్ని వయసుల పురుషుల కోసం సూపర్ డైట్‌ ఇదే.. కచ్చితంగా పాటించాల్సిందే..!

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!