Knowledge: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నాణేం.. దీని ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Knowledge: ప్రపంచంలో కొందరికి ఖరీదైన వాహనాలంటే ఇష్టం. మరికొందరికి ఖరీదైన భవనాలంటే ఇష్టం. ఇంకొందరికి ఖరీదైన ఆభరణాలపై మక్కువ. కానీ కొంతమందికి పురాతన

Knowledge: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నాణేం.. దీని ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Gold Coin
Follow us
uppula Raju

|

Updated on: Apr 01, 2022 | 9:23 AM

Knowledge: ప్రపంచంలో కొందరికి ఖరీదైన వాహనాలంటే ఇష్టం. మరికొందరికి ఖరీదైన భవనాలంటే ఇష్టం. ఇంకొందరికి ఖరీదైన ఆభరణాలపై మక్కువ. కానీ కొంతమందికి పురాతన వస్తువులని సేకరించడం ఇష్టం. వాటికోసం ఎంత దూరమైనా వెళుతారు. ఎంత ఖర్చయినా చెల్లిస్తారు. వాస్తవానికి ప్రపంచంలో అరుదైన వస్తువులకు కొరత లేదు. కానీ వాటి ధరలు చాలామందిని ఆశ్చర్యపరుస్తాయి. ప్రపంచంలోని అనేక దేశాలలో, పురాతన నాణేలను సేకరించే వ్యక్తులు ఉన్నారు. వారి దగ్గర కోటి రూపాయల ధర పలికే నాణేలు కూడా ఉన్నాయి. తాజాగా మనం ఒక నాణేం గురించి చెప్పుకోవాల్సి ఉంది. ఎందుకంటే అది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నాణేం. ఈ నాణెం విలువ కోట్లలో కూడా లేదు. అంతకంటే ఎక్కువ. ఈ ప్రత్యేక నాణెం ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

మీడియా నివేదికల ప్రకారం..1933 డబుల్ ఈగిల్ గోల్డ్ కాయిన్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నాణెం. ఇది ఒక అమెరికన్ నాణెం. నేటి మారకం రేటు ప్రకారం దీని ముఖ విలువ కేవలం $ 20 లేదా దాదాపు రూ. 1,526, అయితే వేలం సమయంలో దీని ధర తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ నాణేం $ 18.87 మిలియన్లకు వేలం వేశారు. భారతీయ రూపాయల్లోకి మార్చితే అది రూ. 144,17,95,950కి సమానం. అంటే 1933 నాటి డబుల్ ఈగిల్ గోల్డ్ కాయిన్ విలువ రూ.144 కోట్ల 17 లక్షల 95 వేల 950 రూపాయలు.

ఈ నాణెం ప్రత్యేకత ఏమిటి?

చాలామంది అరుదైన వస్తువులను సేకరించడానికి ఇష్టపడతారు. దీని కోసం వారు ఎంతైనా చెల్లిస్తారు. ఈ విలువైన నాణేనికి ఒకవైపు అమెరికా లేడీ లిబర్టీ చిత్రం ఉండగా, మరోవైపు అమెరికన్ ఈగిల్ అని ముద్రించారు. 1933 డబుల్ ఈగిల్ అనేది చెలామణి కోసం అమెరికాలో ముద్రించిన చివరి బంగారు నాణెం. ఇది అమెరికాలో మాత్రమే అచ్చు వేయబడింది. కానీ ఇది ఎప్పుడూ చెలామణిలోకి రాలేదు. నివేదికల ప్రకారం.. అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్ ఆ సమయంలో దేశంలో బంగారు నాణేల చెలామణిని నిషేధించారు. దీని తరువాత అతను ముద్రించిన బంగారు నాణేలన్నింటినీ నాశనం చేయమని ఆదేశించాడు. సోత్‌బైస్ 1933 డబుల్ ఈగిల్‌ను ‘హోలీ గ్రెయిల్ ఆఫ్ కాయిన్స్’ అని పిలిచింది.

ICICI Bank: వడ్డీ రేట్లని పెంచిన ఐసీఐసీఐ.. కొత్త రేట్లు ఏంటో తెలుసుకోండి..!

YSR Pension Kanuka: పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌.. నేటి నుంచి వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ.. 2.66 లక్షల మంది వాలంటీర్ల ఏర్పాటు

RGV: శ్రీదేవీ బయోపిక్‌ను ఎందుకు తెరకెక్కించలేదు.. అసలు కారణం చెప్పిన రామ్ గోపాల్ వర్మ..