Ambali Benefits: ఎండకాలంలో ఈ పని చేయండి.. ఒంట్లో వేడి తగ్గుతుంది..

రాష్ట్రంలో ఎండలు(Summer) మండిపోతున్నాయి. అప్పుడే వడగాలులు మొదలయ్యాయి. చాలా మంది ఇంట్లో ఉన్నా వేడిని తట్టుకోలేపోతున్నారు...

Ambali Benefits: ఎండకాలంలో ఈ పని చేయండి.. ఒంట్లో వేడి తగ్గుతుంది..
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Apr 01, 2022 | 2:46 PM

రాష్ట్రంలో ఎండలు(Summer) మండిపోతున్నాయి. అప్పుడే వడగాలులు మొదలయ్యాయి. చాలా మంది ఇంట్లో ఉన్నా వేడిని తట్టుకోలేపోతున్నారు. బయటకు వెళ్లిన వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బయటకు వెళ్లిన వారు డిహైడ్రేషన్(Dehydration) కాకుండా వాటర్ ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అంబలి(Ambali) తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని వివరిస్తున్నారు. గతంలో కూడా అంబలి తీసుకునే వారు.. కానీ కాలం మారే కొద్ది దాన్ని మార్చిపోయారు. కానీ దాని ఉపయోగాలు తెలిస్తే అంబలి తాగాల్సిందే అంటారు. రాగులు, జొన్నలు, కొర్రలతో అంబలిని తయారు చేసుకుని తాగితేచాలా మంచిది. వేసవి కాలం అంబలి మన శరీరానికి దివ్య ఔషదంలా పని చేస్తుంది. వీటిలో ఎన్నో పోషకవిలువలుంటాయి. మరీ ముఖ్యంగా రాగులతో చేసిన అంబలిని తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.

ఎండకాలంలో అంబలిలో కాస్త చల్లను మిక్స్ చేసి తాగితే ఎండ వల్ల ఒంట్లో వేడి పెరిగే అవకాశం ఉండదు. ఇది మీ శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇక అధిక బరువుతో బాధపడేవారు కాలాలతో సంబంధం లేకుండా నిత్యం అంబలిని తాగితే ఎన్నో కేలరీలు ఖర్చైపోతాయి. ముఖ్యంగా అంబలి తాగితే తొందరగా ఆకలి అవదు. అంబలి రోజూ తాగడం వల్ల అలసట రాదు. ముఖ్యంగా మన శరీరానికి కావాల్సిన శక్తి వస్తుంది. మధుమేహం, స్థూలకాయం, బీపీ పేషెంట్లకు ఇది చక్కటి మెడిసిన్‌లా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రాగి అంబలిని తాగడం వల్ల శుక్రకణాల సంఖ్య పెరుగుతుందని పలు పరిశోధనలు ఇప్పటికే వెల్లడించాయి. అలాగే శరీరం కూడా బలంగా తయారవుతుంది. ఈ ఎండాకాలం వేడిచేసే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రతి రోజూ దీన్ని తాగడం వల్ల ఒంట్లో వేడి తగ్గిపోతుందట. పిల్లలకు రాగి అంబలిని తాగించడం వల్ల వారు చురుగ్గా ఉంటారని.. వారి బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేస్తుంది చెబుతున్నారు. బ్రేక్ ఫాస్ట్‌లో అంబలిని తాగితే.. ఆ రోజంతా ఎంతో హుషారుగా ఉంటారు.

గమనిక:- ఈ కథనం కేవలం నిపుణుల సూచనలు మాత్రమే.. ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా మాత్రమే ఇచ్చాం. దీనిని అమలు చేయడానికి ముందుగా వైద్యులను సంప్రదించాలి.

Read Also..  Watermelon Seeds: పుచ్చకాయ గింజలను పడేస్తున్నారా..? లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..