Alcohol Side Effects: రోజూ మద్యం తాగుతున్నారా.? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

|

Jan 13, 2022 | 6:03 PM

ఏదైనా కూడా మితంగా తీసుకుంటే మనం ఆరోగ్యకరంగా ఉంటాం. ఈ సూత్రం ఆల్కహాల్(Alcohol) విషయంలోనూ...

Alcohol Side Effects: రోజూ మద్యం తాగుతున్నారా.? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!
Alcohol
Follow us on

ఏదైనా కూడా మితంగా తీసుకుంటే మనం ఆరోగ్యకరంగా ఉంటాం. ఈ సూత్రం ఆల్కహాల్(Alcohol) విషయంలోనూ వర్తిస్తుంది. ‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే మద్యం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయి. ఏంటి కొత్త విషయాలను చెబుతున్నానని అనుకుంటున్నారా.! అదేం లేదండీ.. ఇప్పుడు చెప్పబోయేవన్నీ కూడా ఆల్కహాల్ గురించి పలు ఆసక్తికర విషయాలు మాత్రమే.! మరి అవేంటో తెలుసుకుందాం పదండి.!

శరీరంలో ఆల్కహాల్ అనేక రకాల ప్రభావాలను చూపిస్తుంది. అలాగే మెదడులో డోపమైన్‌(Dopamine) అనే మోలిక్యుల్‌ను విడుదల చేస్తుంది. స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా మద్యం సేవిస్తారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. చాలా తక్కువ వ్యవధిలోనే మహిళలపై ఆల్కహాల్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.

  • రెడ్ వైన్, విస్కీ లాంటి డార్క్ లిక్కర్స్ వల్ల ఎక్కువగా హ్యాంగోవర్ సమస్యలు వస్తాయి.
  • ‘సరైన పద్ధతిలో సేవిస్తే మద్యం హానికరం కాదు’. ఇలాంటి ప్రకటనలు అస్సలు నమ్మొద్దు.
  • ప్రపంచంలోనే అత్యంత స్ట్రాంగెస్ట్ బీర్‌లో 67.5 శాతం ఆల్కహాల్ ఉంటుంది.
  • ఒక సీసా వైన్ తయారీలో కనీసం 600 ద్రాక్ష పండ్లు అవసరం.
  • మీరు ఎప్పుడైనా వోడ్కాను ఫ్రీజ్ చేయడానికి ప్రయత్నించారా? వోడ్కాను ఫ్రీజ్ చేయాలంటే మైనస్ 16.51 F డిగ్రీ ఉష్ణోగ్రత అవసరం.
  • విస్కీ వాసన ద్వారా మంచి నిద్ర పొందవచ్చు.
  • ఆల్కహాల్‌ను అనేక రూపాల్లో ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తారు.
  • ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం వల్ల క్యాన్సర్ ముప్పు 30 శాతం వరకు తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
  • ఖాళీ కడుపుతో మద్యం సేవిస్తే.. 3 రెట్లు మత్తెక్కుతుంది. అదే ఫుడ్‌తో పాటు మద్యం తాగడం వల్ల ఆలస్యంగా మత్తులోకి వెళ్తారు.

Also Read: 

వీరు జామపండ్లను అస్సలు తినకూడదు.. ఎందుకో తెలుసుకోండి!

ఈ ఫోటోలో పులి దాగుంది.. గుర్తించండి చూద్దాం.. అంత ఈజీ కాదండోయ్!

పాముతో గేమ్సా.. క్షణాల్లో కాటేసింది.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!