Adulteration testing: మీరు కొనుగోలు చేసే కూరగాయలు మంచివేనా.. ఎలా గుర్తించాలంటే..

ప్రస్తుత యుగంలో ప్రతీది కల్తీగా మారింది. ముఖ్యంగా మార్కెట్లో దొరికే కూరగాయలు, దుకాణాల్లో దొరికే కిరాణ సామగ్రిని మనం పైపైన చూసి కొనుగోలు చేస్తుంటాం...

Adulteration testing: మీరు కొనుగోలు చేసే కూరగాయలు మంచివేనా.. ఎలా గుర్తించాలంటే..
Green Vegetables
Follow us

|

Updated on: Jan 30, 2022 | 9:17 PM

ప్రస్తుత యుగంలో ప్రతీది కల్తీగా మారింది. ముఖ్యంగా మార్కెట్లో దొరికే కూరగాయలు, దుకాణాల్లో దొరికే కిరాణ సామగ్రిని మనం పైపైన చూసి కొనుగోలు చేస్తుంటాం. అయితే మన కళ్లు మనల్ని మోసం చేయొచ్చు. చూడటానికి బాగానే ఉన్నా.. ఆ వస్తువుల్లో ప్రమాదకరమైన రసాయనాలు ఉండొచ్చు. అన్ని ఆహార పదార్థాలూ కల్తీ బారిన పడుతున్న నేపథ్యంలో.. వాటిని కొనే ముందు జాగ్రత్తగా పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొనేవి మంచివేవో, కల్తీవేవో తెలుసుకొనేది ఎలా అంటారా? ఇది తెలుసుకునేందుకే భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఓ సింపుల్ టిప్స్​ను షేర్ చేసింది. వివిధ ఆహార పదార్థాల్లో కల్తీని ఎలా గుర్తించాలో వివరించింది. కూరగాయల్లో మలకైట్ గ్రీన్!వస్త్ర పరిశ్రమలో రంగులు అద్దేందుకు ఉపయోగించే మలకైట్ గ్రీన్​ ఆనవాళ్లు కూరగాయల్లో కనిపిస్తున్నాయి. మిరపకాయలు, బఠానీలు, బచ్చలి కూర వంటివి ఆకుపచ్చగా, ఆకర్షణనీయంగా కనిపించేలా దీన్ని వాడతారు. అయితే, ఈ మలకైట్ గ్రీన్ ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్​ఫర్మేషన్ ప్రకారం.. సమయం, ఉష్ణోగ్రత తదితర కారణాలను బట్టి ఈ మలకైట్గ్రీన్.. ప్రమాదకరంగా మారుతుంది. ఇది శరీరంలోకి వెళ్తే శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. పిండం సరిగా పెరగకపోవడం, క్రోమోజోములు దెబ్బతినడం వంటివి జరుగుతాయి. ఈ నేపథ్యంలో కల్తీపై అవగాహన కల్పించడానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ ట్విట్టర్​ వేదికగా పలు సూచనలు చేసింది.

  • కొంచెం దూదిని తీసుకొని పారాఫిన్ ద్రావణంలో నానబెట్టాలి.
  • బెండకాయపై దూదితో రుద్దాలి.రంగులో ఎలాంటి మార్పు లేకపోతే కల్తీ జరగలేదని అర్థం.
  • దూది ఆకుపచ్చ రంగులోకి మారిపోతే కల్తీ జరిగినట్లే

Read Also.. Health Tips: తిన్న తర్వాత ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. ఎందుకో తెలుసుకోండి..

Latest Articles
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!